Most Expensive Home Hero: ఈ ఇంటి విలువ రూ.800 కోట్లు.. ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో ఇతడే
Most Expensive Home Hero: ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో ఎవరు? ఈ ప్రశ్న అడగ్గానే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి పేర్లు చెప్పొచ్చు. కానీ వీళ్లెవరూ కాదు. ఏకంగా రూ.800 కోట్ల విలువ ఉన్న ఇల్లు కలిగిన హీరో కూడా ఓ ఖానే. ఎవరో తెలుసా?
Most Expensive Home Hero: లగ్జరీ జీవితాలను ఎంజాయ్ చేసే మన హీరోల ఇళ్లు కూడా అంతే లగ్జరీగా ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు ముంబైలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఉంటారు. కానీ బాలీవుడ్ కే చెందిన సైఫ్ అలీ ఖాన్ ఇంటి విలువ ఏకంగా రూ.800 కోట్లు అన్న విషయం తెలుసా? అంతేకాదు ఈ ఇల్లు ముంబైలో లేదు.
అత్యంత ఖరీదైన ఇల్లు
ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో సైఫ్ అలీ ఖాన్. నవాబుల కుటుంబానికి చెందిన ఈ హీరో దగ్గర ఏకంగా రూ.800 కోట్ల విలువ చేసే ప్యాలెస్ ఉంది. అది కూడా హర్యానాలోని ఓ మారుమూల ప్రదేశంలో కావడం విశేషం. ఇంత పెద్ద, లగ్జరీ ఇల్లు దేశంలో మరే హీరో దగ్గరా లేదు. ఢిల్లీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని పటౌడీలో ఈ పటౌడీ ప్యాలెస్ ఉంది.
సైఫ్ అలీ ఖాన్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఈ ప్యాలెస్ ను నిర్మించాడు. అతడు బేగమ్ ఆఫ్ భోపాల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి తాము ఉంటున్న ఇల్లు తమ రాచరికానికి తగినట్లు లేదని భావించి ఈ భారీ ప్యాలెస్ నిర్మించాడు. ప్రస్తుతం నవాబ్ ఆఫ్ పటౌడీగా ఉన్న సైఫ్ అలీ ఖాన్ పేరిట ఈ ఇల్లు ఉంది. ప్రతి సమ్మర్ లో అతనితోపాటు అతని చెల్లెలు సోహా అలీ ఖాన్ కూడా ఈ ప్యాలెస్ కు వచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తారు.
కోట్ల అప్పు చెల్లించి..
సైఫ్ అలీ ఖాన్ తాత ఈ ప్యాలెస్ కట్టించినా.. ఇది వారసత్వంగా నేరుగా అతనికి దక్కలేదు. ఈ ప్యాలెస్ పై కాలక్రమంలో కోట్ల కొద్దీ అప్పులు అయ్యాయి. 2011లో సైఫ్ తండ్రి, నటి షర్మిలా ఠాగూర్ భర్త మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత ఆ అప్పును తాను తీర్చి ప్యాలెస్ ను తిరిగి సొంతం చేసుకున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సైఫ్ చెప్పాడు.
ప్రస్తుతం ఈ ప్యాలెస్ ను సినిమాల షూటింగ్ కు కూడా అద్దెకు ఇస్తున్నారు. గతేడాది వచ్చిన యానిమల్ మూవీ తీసింది ఈ ప్యాలెస్ లోనే. అంతేకాదు అంతకుముందు షారుక్ ఖాన్ నటించిన వీర్ జారా, ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ తాండవ్ కూడా ఇందులోనే చిత్రీకరించారు.
షారుక్, అమితాబ్‌లను మించి..
ముంబై వెళ్తే ఎవరైనా సరే షారుక్ ఖాన్, అమితాబచ్ బచ్చన్ ల ఇళ్లను చూసి రావాలని అనుకుంటారు. ఆ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వీళ్ల ఇళ్లు ఉన్నాయి. షారుక్ ఖాన్ కు చెందిన మన్నత్, అమితాబ్ కు చెందిన జల్సా అంటే ముంబై వాసులకే మొత్తం దేశంలోని సినీ అభిమానులందరికీ తెలుసు.
అయితే షారుక్ ఎంతో అందంగా కట్టుకున్న మన్నత ఇంటి విలువ ప్రస్తుతం రూ.200 కోట్లు కాగా.. అమితాబ్ జల్సా విలువ రూ.120 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే సైఫ్ అలీ ఖాన్ రూ.800 కోట్ల ఇంటి ముందు ఇవి దిగదుడుపే.