OTT Horror: 2 ఓటీటీల్లో హారర్ కామెడీ మూవీ- మనిషి మాంసం తినే ఆడ పిశాచాలు, చిత్రహింసలు పెట్టే స్టూడెంట్స్- 6.3 రేటింగ్!-mon mon mon monsters ott streaming on amazon prime apple plus tv horror thriller movie mon mon mon monsters ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: 2 ఓటీటీల్లో హారర్ కామెడీ మూవీ- మనిషి మాంసం తినే ఆడ పిశాచాలు, చిత్రహింసలు పెట్టే స్టూడెంట్స్- 6.3 రేటింగ్!

OTT Horror: 2 ఓటీటీల్లో హారర్ కామెడీ మూవీ- మనిషి మాంసం తినే ఆడ పిశాచాలు, చిత్రహింసలు పెట్టే స్టూడెంట్స్- 6.3 రేటింగ్!

Sanjiv Kumar HT Telugu

Mon Mon Mon Monsters OTT Streaming: ఓటీటీల్లో హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా 2 ఓటీటీల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. మనిషి మాంసాన్ని తినే ఆడ పిశాచాలు 500 ఏళ్లుగా చీకట్లోనే ఉంటాయి. అవి బయటకు రావడంతో కథ మొదలయ్యే ఈ సినిమాను ఈ ఓటీటీల్లో చూసేయండి!

2 ఓటీటీల్లో హారర్ కామెడీ మూవీ- మనిషి మాంసం తినే ఆడ పిశాచాలు, చిత్రహింసలు పెట్టే స్టూడెంట్స్- 6.3 రేటింగ్!

Mon Mon Mon Monsters OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వీటిలో హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ వంటి జోనర్లలోనే ఎక్కువగా సినిమాలు ఉంటాయి. ఇక హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ సెపరేట్‌గా ఉంటాయి.

చివరి మూవీగా ప్రదర్శన

కథ ఎలా ఉన్న భయపెట్టే హారర్ సీక్వెన్స్‌తో ఇవి మినిమమ్ గ్యారెంటీ మూవీస్‌గా నిలుస్తుంటాయి. చాలా వరకు ఆడియెన్స్ హారర్ సినిమాలను చూసేందుకే ఇష్టపడుతుంటారు. అలాంటి సినిమాల్లో ఒకటే మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్. 2017లో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా 41వ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చివరి మూవీగా ప్రదర్శించారు.

మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు

ఏప్రిల్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన అనంతరం 2017 జూలై 28న థియేటర్లలో మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ సినిమాను విడుదల చేశారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీ 6.3 రేటింగ్ ఇచ్చింది. గిడ్డెన్స్ కో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 500 ఏళ్లుగా చీకట్లోనే ఆడ పిశాచాలు బతుకుతూ ఉంటాయి. చీకట్లో ఉంటూ మనుషులను, మనుషి మాంసాన్ని పీక్కుతుంటూ ఉంటాయి.

పట్టించుకోని టీచర్

మరోవైపు స్కూల్‌లో జాక్ అనే కుర్రాడిని మిగతా స్టూడెంట్స్ అంతా ఏడిపిస్తుంటారు. వారిలో రెన్హో అనే వాడు లీడర్. అతను చెప్పినట్లే అంతా చేస్తారు. జాక్‌ను రెన్హో బాగా ఏడిపిస్తుంటాడు. ఆ విషయం టీచర్‌కు చెప్పిన పట్టించుకోదు. కావాలనే చాడీలు చెబుతున్నాడని ఊరుకుంటుంది. ఓసారి ఒక ముసలాయిన ఇంట్లో దొంగతనానికి తన గ్యాంగ్‌తోపాటు జాక్‌ను కూడా వెంట తీసుకెళ్తాడు రెన్హో.

మనిషి మాంసం తినే ఆడ మాన్‌స్టర్స్

అక్కడే చీకట్లో మనిషి మాంసం తినే రెండు ఆడ పిశాచాలను చూసి భయంతో పరుగెత్తారు. వారి వెంట ఆ దెయ్యం పడుతుంది. అయితే, ఎలాగోలా తప్పించుకున్న ఆ రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి ఓ పెట్టే దొంగతనం చేసి తీసుకొస్తారు. అందులో నుంచి కూడా ఓ మాన్‌స్టర్ బయటకొస్తుంది. కానీ, అది ఎండ వేడి తగిలేసరికి శరీరం కాలిపోతుంది.

మాన్ మాన్ మాన్ మాన్స‌స్టర్స్ ట్విస్టులు

దాని బలహీనతను చూసి ఎలాగోలా పట్టుకుంటుంది రౌడీ బ్యాచ్. తర్వాత ఆ దెయ్యాన్ని చిత్రహింసలు పెడుతుంటారు స్టూడెంట్స్. ఆ మాన్‌స్టర్ కోసం మరో మాన్‌స్టర్ వెతుక్కుంటూ ఈ స్టూడెంట్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది?, ఆ మాన్‌స్టర్స్ ఏం చేశాయి?, అవి అలా ఎందుకు మారాయి?, వాటి నేపథ్యం ఏంటీ? మాన్‌స్టర్స్‌కు జాక్ ఎందుకు హెల్ప్ చేశాడు? వంటి అంశాలతో సినిమా సాగుతుంది.

2 ఓటీటీల్లో స్ట్రీమింగ్

మాన్ మాన్‌ మాన్ మాన్‌స్టర్స్ ఒక తైవానీస్ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, యాపిల్ ప్లస్ టీవీ వంటి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ రెండింట్లో రెంటల్ విధానంలో మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తైవానీస్ భాషలో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అర్థవంతంగా ఓటీటీలోని మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.