మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటనకు పెట్టింది పేరు. మ్యాచో హీరోగా యాక్షన్, ఎమోషనల్ సీన్ల్స్‌లో ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో ఇరగదీస్తారు. అటువంటి మోహన్ లాల్ అమ్మాయిలా నగలు వేసుకుని మురిసిపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
నిజానికి అది ఒక జ్యూవెలరీ యాడ్. లింగ నిబంధనలను, లింగ వివక్షను సవాలు చేస్తూ ఓ జ్యూవెలరీ యాడ్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మోహన్ లాల్. విన్స్‌మెరా జ్యువెల్స్ కోసం ఒంటిపై ఆభరణాలు వేసుకుని మోహన్ లాల్ చేసిన యాడ్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది.
సాధారణంగా మోహన్ లాల్ ఓ మగాడిగా, మ్యాచోగా కనిపించడాన్ని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ విషయంలో తాను ముందే భయపడినట్లు, ట్రోలింగ్ ఎదుర్కొనే అవకాశం ఉందని టెన్షన్ పడినట్లు మోహన్ లాల్ పర్సనల్ స్టైలిస్ట్ శాంతి కృష్ణ తాజాగా ఆమె ఫీలింగ్స్ బయటపెట్టారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన స్టైలిస్ట్ శాంతి కృష్ణ.. ట్రోల్ అవుతుందని భావించిన మోహన్ లాల్ జ్యూవెలరీ యాడ్ షూటింగ్ సమయంలో ఎదురైన భయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు.
"ప్రతిదీ ట్రోల్ చేసే కాలంలో మనం నివసిస్తున్నాం. ఆ సమయంలోనే నేను నిజంగా భయపడ్డాను. మోహన్ లాల్ సార్‌తో నా బాధలు పంచుకున్నప్పుడు దాన్ని ఒక కళాఖండంగా భావించి కేవలం నా వంతు కృషి చేయమని ఆయన నాకు చెప్పారు. ఆ మాటలు నిజంగా నాలో ఉత్సాహాన్ని నింపాయి" అని శాంతి కృష్ణ తెలిపారు.
అలాగే, మోహన్ లాల్ నటనను చూడటం 'ప్యూర్ మ్యాజిక్' లాంటిదని చెప్పిన స్టైలిస్ట్ తనకు భయం ఉన్నప్పటికీ మోహన్ లాల్ ఈ యాడ్‌లో నటించడానికి ప్రయత్నించాడని చెప్పారు. మోహన్ లాల్ సర్ పర్ఫామెన్స్ చూడటం ఎప్పుడూ ఆనందమేనని, కానీ ఈసారి మాత్రం అది ప్యూర్ మ్యాజిక్ అని ఆయన చెప్పుకొచ్చారు.
"ఇలాంటి వాటిని తిప్పికొట్టే సత్తా ఆయనకు మాత్రమే ఉందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. అతను తన గోళ్ల నుండి కంటి కదలికల వరకు ప్రతి వివరాలపై నమ్మశక్యం కాని శ్రద్ధ వహిస్తారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ మ్యాజిక్ చేశారు' అని స్టైలిస్ట్ శాంతి కృష్ణ పేర్కొన్నారు.
ఇకపోతే ప్రకాష్ వర్మ యాడ్‌లో మోహన్ లాల్‌ను స్టైల్ చేయడం ఛాలెంజ్ అని శాంతి కృష్ణ తెలిపారు. తుడరుమ్ సినిమాలో మోహన్ లాల్‌కు సహా నటుడిగా ప్రకాష్ వర్మ నటించారు.
కాగా, 2024లో మలైకోట్టై వాలిబన్, బరోజ్ త్రీడీ చిత్రాలతో నిరాశపరిచిన మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్, తుడరుమ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు.
సంబంధిత కథనం