OTT Political Actrion Thriller: సీక్వెల్ రిలీజ్‍కు ముందు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం
OTT: లూసిఫర్ చిత్రానికి ఓటీటీలో మళ్లీ భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఈ చిత్రం సీక్వెల్ ఎల్2: ఎంపురాన్ రిలీజ్‍కు ముందు ఆ ఫస్ట్ పార్ట్ మూవీ ఓటీటీలో ట్రెండింగ్‍లోకి వచ్చింది. మంచి వ్యూస్ సాధిస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2019 మార్చిలో రిలీజై బంపర్ హిట్ కొట్టింది. రూ.30కోట్లతో రూపొంది దాదాపు రూ.120కోట్ల కలెక్షన్లు సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‍గా ఎల్ 2: ఎంపురాన్ చిత్రం వస్తోంది. రేపే (మార్చి 27) ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అయితే, సీక్వెల్ విడుదలకు ముందు ఫస్ట్ పార్ట్ ఓటీటీలో అదరగొడుతోంది.
ట్రెండింగ్‍లోకి లూసిఫర్
ఎల్2: ఎంపురాన్ థియేటర్లలో రిలీజయ్యే ముందు లూసిఫర్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు. ఎంపురాన్ మూవీకి సిద్ధమైన వారు లూసిఫర్ చూస్తూ కథను గుర్తు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రైమ్ వీడియోలో లూసిఫర్‌కు ఇప్పుడు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. తమిళ వెర్షన్ కూడా ట్రెండింగ్‍లోకి వచ్చింది. లూసిఫర్ చిత్రం ప్రైమ్ వీడియోలో మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో ఉంది.
లూసిఫర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. మురళి గోపీ అందించిన పవర్‌ఫుల్ స్టోరీ, మోహన్‍లాల్ సూపర్ ఇంటెన్స్ యాక్టింగ్, వృథ్విరాజ్ సుకుమార్ డైరెక్షన్, టేకింగ్, నరేషన్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ఒకానొక బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ నిలిచింది. క్లాసిక్ చిత్రంగా పేరుతెచ్చుకుంది. అలాంటి సినిమాకు ఆరేళ్లకు సీక్వెల్‍గా ఎల్2: ఎంపురాన్ వస్తోంది.
బుకింగ్‍ల్లో అదరగొడుతున్న ఎల్2: ఎంపురాన్
ఎల్2: ఎంపురాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మోహన్‍లాల్ మరింత శక్తివంతంగా కనిపించనున్నారు. దర్శకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ ఈసారి గ్రాండ్ స్కేల్‍లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఖరీదైన చిత్రంగా వస్తోంది. ఎల్2: ఎంపురాన్ మూవీకి దాదాపు రూ.150కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది.
ఎల్2: ఎంపురాన్ సినిమా రేపు (మార్చి 27) మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అంచనాలకు తగ్గట్టే టికెట్ల బుకింగ్‍ల్లో ఈ చిత్రం అదరగొడుతోంది. భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది.
ఎల్2: ఎంపురాన్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఈ చిత్రం కోసం తాను, మ్యూనరేషన్ తీసుకోలేదని, బడ్జెట్‍లో అధిక శాతం మూవీ తెరకెక్కింమోహన్‍లాల్ రెచేందుకే ఖర్చు చేశామని పృథ్విరాజ్ ఇటీవల చెప్పారు. ఈ చిత్రం గ్రాండ్ స్కేల్ చూసి ఆశ్చర్యపోతారని అన్నారు. ఈ సినిమాకు దీపక్ దేవ్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం