పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చేసిన మోహన్‌లాల్ కొత్త సినిమా ‘తుడరుమ్’ కలక్షన్ల రికార్డు నెలకొల్పింది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేరళలోని ఈ మూవీ కలెక్షన్ల ఊచకోతతో అదరగొడుతోంది. మరే మలయాళ మూవీకి సాధ్యం కాని ఘనతను అందుకుంది.
కేరళ బాక్సాఫీస్ దగ్గర తుడరుమ్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. సరికొత్త చరిత్ర నమోదు చేసింది. కేరళలోని రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఫస్ట్ మలయాళ మూవీగా తుడరుమ్ నిలిచింది. మోహన్‌లాల్ లేటెస్ట్ ఫిల్మ్ తుడరుమ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మోహన్‌లాల్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
‘‘ఎక్స్ క్యూజివ్ గా కేరళ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రూ.100 కోట్ల మార్క్ తో తుడరుమ్ రికార్డు బుక్స్ లో చోటు దక్కించుకుంది. మనం కలిసి ఈ మైలురాయి క్రియేట్ చేశాం. థ్యాంక్ యూ కేరళ’’ అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 25న రిలీజైన మలయాళ బ్లాక్ బస్టర్ తుడరుమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. 19 రోజుల్లో ఈ మూవీ ఇండియాలో రూ.104 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని సక్కిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు ఇప్పటికే రూ.200 కోట్లు దాటేశాయి. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్, రికార్డుల కారణంగా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో మలయాళ సినిమాగా ఈ మూవీ నిలిచింది. 19వ రోజు (మే 13) ఈ మూవీ ఇండియాలోనే రూ.2.35 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ తో మోహన్‌లాల్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. పోయిన తన ట్యాక్సీని వెతుక్కుంటూ షణ్ముగం 'బెంజ్' ఎంతవరకు వెళతాడు అనేది సినిమా కథాంశం. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి నటి శోభన తెరపై కలిసి నటించడం విశేషం.
ఎల్2 ఎంపురాన్ లో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన మోహన్ లాల్.. తుడరుమ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా, ట్యాక్సీ కోసం వెతికే పర్సన్ గా యాక్టింగ్ తో సత్తాచాటారు. ఈ మూవీకి తరుణ్ మూర్తి డైరెక్టర్.
సంబంధిత కథనం