తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్, శోభన జంటగా నటించిన తుడరుమ్ బాక్సాఫీస్ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇండియాలోనే రూ.100 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది. ఇక కేరళలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా తుడరుమ్ ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఓవరాల్ గా ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్లలో మూడో మలయాళ సినిమాగా నిలిచింది.
తుడరుమ్ రిలీజై 18 రోజులైనా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడ కొనసాగిస్తోంది. 18వ రోజు (మే 12) ఈ మూవీ ఇండియాలో రూ.2.49 కోట్ల నెట్ వసూలు చేసినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఏప్రిల్ 25న రిలీజైన ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ 18 రోజుల్లో ఇండియాలో రూ.101.53 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిందని సక్నిల్క్ పేర్కొంది.
పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన తుడరుమ్ బాక్సాఫీస్ దగ్గర క్రమంగా కలెక్షన్లు పెంచుకుంటూ పోయింది. ఫస్ట్ డే (రూ.5.25 కోట్లు) కంటే సెకండ్ (రూ.8.6 కోట్లు), థర్డ్ (రూ.10.5 కోట్లు) డే ఎక్కువ నెట్ వసూళ్లు సాధించింది. తొలివారంలో రూ.51.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో వారంలో రూ.35.35 కోట్లు రాబట్టింది. సోమవారం ఈ చిత్రం మొత్తం 31.74% మలయాళ ఆక్యుపెన్సీని కలిగి ఉంది.
తుడరుమ్ గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్లు దాటేశాయి. 17 రోజుల్లో ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.201.5 కోట్లుగా ఉన్నాయి. 18వ రోజు మరో రూ.3.5 కోట్లు యాడ్ అయ్యే అవకాశముంది. కేరళలోనే ఈ మూవీ రూ.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లేమే రూ.86 కోట్లకు పైగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వసూళ్లు రూ.4 కోట్ల వరకూ ఉన్నాయి.
ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ తో మోహన్ లాల్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. పోయిన తన ట్యాక్సీని వెతుక్కుంటూ షణ్ముగం 'బెంజ్' ఎంతవరకు వెళతాడు అనేది సినిమా కథాంశం. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి నటి శోభన తెరపై కలిసి నటించడం విశేషం. ఎల్2 ఎంపురాన్ లో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన మోహన్ లాల్.. తుడరుమ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా, ట్యాక్సీ కోసం వెతికే పర్సన్ గా యాక్టింగ్ తో సత్తాచాటారు.
సంబంధిత కథనం