L2 Empuraan: మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ట్రైలర్.. రాజమౌళి, ఆర్జీవీ ప్రశంసలు-mohanlal l2 empuraan trailer released and rajamouli ram gopal varma rajinikanth praises prithviraj sukumaran superstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  L2 Empuraan: మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ట్రైలర్.. రాజమౌళి, ఆర్జీవీ ప్రశంసలు

L2 Empuraan: మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ట్రైలర్.. రాజమౌళి, ఆర్జీవీ ప్రశంసలు

Sanjiv Kumar HT Telugu

Mohanlal L2 Empuraan Trailer Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఎల్2 ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్2 ఎంపురాన్ ట్రైలర్‌పై డైరెక్టర్స్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు.

మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ట్రైలర్.. రాజమౌళి, ఆర్జీవీ ప్రశంసలు

Mohanlal L2 Empuraan Trailer Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో లూసిఫర్ మూవీ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఎల్2 ఎంపురాన్. ఈ సినిమాకు ప్రభాస్ సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు.

ఎల్2 ఎంపురాన్ ట్రైలర్

తాజాగా మార్చి 20న ఎల్2 ఎంపురాన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో, హై రేంజ్ ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ సాగింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్క్రీన్ ప్రజెన్స్ తెగ ఆకట్టుకుంది. మొదటి సినిమాలోలాగే టొవినో థామస్ కూడా కీ రోల్ పోషించాడు. మంజు వారియర్, సానియా అయ్యప్పన్, వివేక్ ఒబేరాయ్, జెరోమీ ఫ్లిన్, కెరోలిన్ కోజియోల్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

‘నా బిడ్డ‌లు కాదు న‌న్ను ఫాలో అయింది.. న‌న్ను ఫాలో అయిన‌వాళ్లు ఎవరో వాళ్లే నా బిడ్డ‌లు’, ‘పి.కె. రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వ‌తంగా కూల్చాల‌ని ప్ర‌య‌త్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శ‌త్రువులు కాదు’, ‘మ‌న‌దేశంలో రాజ‌నీతి ఓ వ్యాపారం’, ‘మ‌నుషుల ప్రాణాల కంటే ఓ ర‌క్త సంబంధానికైనా విలువ ఉంటుంద‌ని నేను అనుకోవ‌టం లేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఎంపురాన్ డైలాగ్స్

‘స్టీఫెన్ ఎక్క‌డ‌’, ‘అత‌ని క‌ళ్లు అన్నింటినీ చూస్తున్నాయి’, ‘చీక‌టి గ్ర‌హాల ఎంపురాన్‌’, ‘కేర‌ళ రాష్ట్రంలో ఓ సాధార‌ణ ఎమ్మెల్యే అత‌ను. అత‌న్ని చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? మ‌న‌కు తెలియంది ఏదో ఒక‌టి స్టీఫెన్ నెడుంప‌ల్లి క‌థ‌లో ఉంది’, ‘దైవ‌పుత్రుడే అన్యాయం చేస్తున్న‌ప్పుడు సైతాన్‌ను కాకుండా ఎవ‌ర్ని సాయం అడ‌గ‌గ‌లం’, ‘స్టీఫెన్ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి నీ మ‌నిషిని, దైవానికి ఆత్మ‌లాంటి దేశాన్ని కాపాడుకో’ అనే సంభాషణలు సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

మూడు భాగాలుగా రాబోతున్న ఈ ఫ్రాంచైజీలో ఎల్2 ఎంపురాన్ రెండో భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, ట‌ర్నులు, రాజకీయ వ్యూహాలు, ప‌న్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్ర‌తి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే స‌న్నివేశాలు, నిర్మాణాత్మ‌క విలువ‌లతో ఇది సాగనుందని తెలుస్తోంది.

మొదటి షాట్ నుంచి

ఎల్2 ఎంపురాన్ ట్రైలర్‌పై డైరెక్టర్స్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, హీరో రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఎల్2 ఎంపురాన్ తెలుగు ట్రైలర్‌ను షేర్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి “ఎంపురాన్ ట్రైలర్ మొదటి షాట్ నుంచి నన్ను ఆకట్టుకుంది. మోహన్ లాల్ గారి ఆదేశించే తీరు నిజంగా ఆకట్టుకుంది. భారీ స్థాయి, అద్భుతమైన యాక్షన్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇది ఇప్పటికే బ్లాక్ బస్టర్‌లాగా అనిపిస్తుంది. మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఎల్2 ఎంపురాన్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అని రాశారు.

లాస్ట్ షాట్ చంపేసింది

ఎల్2 ఎంపురాన్ ట్రైలర్ హిందీ వెర్షన్‌ను షేర్ చేస్తూ.. “పాత్రలు, యాక్షన్‌లో పదిరెట్లు బిగ్గర్‌గా, అల్ట్రా రిచ్‌గా ఎంపురాన్ ఉంది. ట్రైలర్‌లోని లాస్ట్ షాట్ అయితే చంపేసింది. లూసిఫర్ వెనుక ఉన్న మనిషి (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరనేది సింబాలిక్‌గా చూపించారు” అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.

ఫెంటాస్టిక్ వర్క్

తమిళ ట్రైలర్‌ను పోస్ట్ చేసిన రజనీకాంత్ “నా ప్రియమైన మోహన్, పృథ్వీల ఎంపురాన్ ట్రైలర్ చూశాను. ఫెంటాస్టిక్ వర్క్. అభినందనలు. నేను మీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్” అని తెలిపారు. దీనికి “థాంక్యూ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను సార్!” అని పృథ్వీరాజ్ సుకుమారన్ రిప్లై ఇచ్చాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం