Mohanlal L2 Empuraan first look: మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మలయాళ స్టార్
Mohanlal L2 Empuraan first look: మోహన్ లాల్ బర్త్ డే సందర్బంగా అతని నెక్ట్స్ మూవీ ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ షేర్ చేశాడు. ఇందులో అతడు చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Mohanlal L2 Empuraan first look: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మంగళవారం (మే 21) తన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షేర్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఇది మోహన్ లాల్ నటిస్తున్న ఎల్2 ఎంపురాన్ మూవీకి సంబంధించిన పోస్టర్ కావడం విశేషం.
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్
మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో బ్లాక్ బస్టర్ మూవీ లోడ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఎల్2 ఎంపురాన్. 2019లో వచ్చిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్ కావడం విశేషం. ఆ సినిమాలో నటించిన మోహన్ లాలే ఇందులోనూ నటిస్తున్నాడు. ఈసారి సీక్వెల్ కు కూడా పృథ్వీరాజ్ సుకుమారనే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతేడాది నవంబర్ లోనే మోహన్ లాల్ బ్యాక్ చూపిస్తూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది.
అయితే తాజాగా అతని ఫ్రంట్ లుక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో 64 ఏళ్ల మోహన్ లాల్ చాలా యంగ్, ఎనర్జటిక్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జాకెట్, ట్రౌజర్స్ లో ఆల్ బ్లాక్ లుక్ లో అదిరిపోయాడు. బ్లాక్ గాగుల్స్ తో స్టైలిష్ లుక్ తో ఉన్న అతడి పోస్టర్ ను డైరెక్టర్ పృథ్వీరాజ్ షేర్ చేశాడు. "హ్యాపీ బర్త్ డే లాలెట్టా.. ఖురేషీ అబ్రామ్, ఎల్2ఈ. హ్యాపీ బర్త్ డే మోహన్‌లాల్" అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు.
మోహన్‌లాల్ ఎల్ 2 మూవీ గురించి..
2019లో లూసిఫర్ మూవీతో పృథ్వీరాజ్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మోహన్ లాల్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఇదే మూవీని తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్ పేరుతో తీసి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ లూసిఫర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమానే ఈ ఎల్2 ఎంపురాన్.
నిజానికి ఈ సినిమాను ఆగస్ట్, 2022లోనే అనౌన్స్ చేశారు. లూసిఫర్ మూవీలో మోహన్ లాల్ ఎనర్జటిక్ స్టీఫెన్ నేడుమ్‌పల్లి పాత్రలో నటించాడు. ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లోనూ రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ ఎల్2ఈ మూవీని నిర్మిస్తోంది.
గతేడాది అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మధ్యే మూడో షెడ్యూల్ పూర్తయినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు. ఈ ఏడాది మలైకొట్టై వాలిబన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్ నిరాశపరిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. గతేడాది నేరు మూవీలో అడ్వొకేట్ గా అదరగొట్టిన అతడు.. ఈ ఎల్2 ఎంపురాన్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
మోహన్ లాల్ ఈ ఎల్2 తర్వాత డైరెక్టర్ తరుణ్ మూర్తితో మరో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ తన కెరీర్లో 360వ సినిమా కానుండటం విశేషం. ఈ సినిమా కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు గతంలో అతడు చెప్పాడు.