Barroz OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రూ.150కోట్ల బడ్జెట్ మోహన్‍లాల్ మూవీ.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Barroz OTT Release Date: బరోజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎప్పుడంటే..
మలయాళ ఇండస్ట్రీ నుంచి అత్యంత ఖరీదైన చిత్రంగా ‘బరోజ్’ రూపొందింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. తొలిసారి ఈ మూవీతో దర్శకుడిగా మారారు మోహన్ లాల్. ఈ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించారు. దీంతో విడుదలకు ముందు బరోజ్ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే, గత డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

బరోజ్ చిత్రం ముందు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. మోహన్ లాల్‍కు నిరాశ ఎదురైంది. ఇప్పుడు బరోజ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్‍గా ఫిక్స్ అయింది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బరోజ్ చిత్రం రేపు (జనవరి 22) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. అర్ధరాత్రే అందుబాటులోకి వస్తుంది. అంటే మరికొన్ని గంటల్లో బరోజ్ సినిమా స్ట్రీమింగ్ హాట్‍స్టార్ ఓటీటీలో షురూ అవుతుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. “బరోజ్: ది గార్జియన్ ఆఫ్ ట్రెజర్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టండి. జనవరి 22వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది” అని హాట్‍స్టార్ వెల్లడించింది.
నాలుగు భాషల్లో..
బరోజ్ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ అంటూ కొంతకాలంగా ఊరిస్తూ వచ్చింది హాట్‍స్టార్. జనవరి 22న తీసుకొస్తున్నట్టు ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. థియేటర్లలో ఫ్లాఫ్ అయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
కమర్షియల్‍గా భారీ డిజాస్టర్
బరోజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. ఐదు భాషల్లో 3డీ ఫార్మాట్లో పాన్ ఇండియా రిలీజ్ చేయగా.. అన్ని చోట్ల ఈ మూవీకి పరాభవం ఎదురైంది. రూ.150 కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీకి సుమారు రూ.20కోట్ల కలెక్షన్లే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ బరోజ్ చిత్రం బోల్తా కొట్టి, భారీ నష్టాలను మిగిల్చింది.
బరోజ్ చిత్రంలో మోహన్‍లాల్‍తో పాటు మాయా రావ్, గురు సోమసుందరం, తుహిన్ మీనన్, ఇగాసియో మాటెయోస్, గోపాలన్ అదత్, జాషువా ఒకేసలాకో ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఓ నిధిని సంరక్షించే దెయ్యం స్టోరీలైన్‍తో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కించారు మోహన్‍లాల్. కానీ దర్శకుడిగా చిత్రంతో తీవ్రంగా నిరాశపరిచాడు.
బరోజ్ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ప్రొడ్యూజ్ చేశారు. లిడియన్ నాదేశ్వరం, ఫెర్నాండో, మిగుయెల్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేశారు.
కాగా, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 31వ తేదీన ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ నిధిని అన్వేషించం చుట్టూ ఈ హిందీ సిరీస్ సాగుతుంది.
సంబంధిత కథనం