మోహన్‌లాల్, జీతూ జోసఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలు ప్రేక్షకుల మెప్పుతో పాటు కమర్షియల్‌గా విజయాల్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రం థియేటర్లలో విడుదల కాగా దృశ్యం -2 మాత్రం కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జార్జ్ కుట్టిగా మోహన్‌లాల్ నటనతో పాటు కథలోని ట్విస్ట్‌లు, జీతూ జోసెఫ్ స్క్రీన్‌ప్లేను రాసుకున్న విధానానికి ప్రశంసలు దక్కాయి.
దృశ్యం ఫ్రాంచైజ్‌కు మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. దృశ్యం సినిమా తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని దక్కించుకున్నది. దృశ్యం ఫ్రాంచైజ్‌లో మూడో భాగం రాబోతున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజావిల్ అవార్డ్ వేడుకలో దృశ్యం 3పై ప్రొడ్యూసర్ ఆంటోనీ పెరవంబూర్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. దృశ్యం 3 సినిమా ఉంటుందని వెల్లడించారు.
మర్డర్ కేసు నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జికుట్టి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మూడో భాగంలో ఎలాంటి అతడి ఫ్యామిలీకి ఎలాంటి విపత్తు ఎదురవుతుందన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మూడో దృశ్యంలో మీనా, ఎస్తేర్ అనిల్, అనీష్బా హాసన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే మూడో భాగం షూటింగ్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.