అబ్బాయి, అమ్మాయి ఇష్టపడటం.. ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని అనుకోవడం.. మధ్యలో అవాంతరాలు.. చివరకు ఒక్కటవడం.. ఇలాంటి స్టోరీలో సినిమాల్లో చాలానే వచ్చాయి. ట్విస్ట్ లతో సాగే లవ్ స్టోరీలతో మూవీస్ కూడా ఉన్నాయి. కానీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లైఫ్ లోనూ ఇలాంటి ట్విస్ట్ లతో కూడిన లవ్ స్టోరీ ఉంది. ఈ రోజు (మే 21) మోహన్‌లాల్ 65వ పుట్టిన రోజు.
1980ల్లో మోహన్‌లాల్ స్టార్ డమ్ పీక్ లో ఉంది. అప్పటికే ఆయన మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ అమ్మాయి.. మోహన్‌లాల్‌ను ప్రేమించింది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ అమ్మాయి పేరు సుచిత్ర. మోహన్‌లాల్ కూడా ఆ అమ్మాయిను ఇష్టపడ్డారు. అంతా ఒకే అనుకుంటుండగా ట్విస్ట్ నెలకొంది.
ప్రేమలో మునిగితేలిన మోహన్‌లాల్, సుచిత్ర పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీళ్ల జాతకాలు కలవలేదు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినా కూడా మోహన్‌లాల్, సుచిత్ర పట్టు వదల్లేదు. ఒకరి చేయి మరొకరు విడవలేదు. రెండేళ్ల పోరాటం తర్వాత చివరకు పెళ్లి చేసుకున్నారు. 1988 ఏప్రిల్ 28న వివాహంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కొడుకు, కూతురున్నారు.
45 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో మోహన్‌లాల్ ఎన్నో సినిమాలు చేశారు. 360కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. చాలానే అవార్డులు అందుకున్నారు. బాగానే సంపాదించారు. ఆయన నెట్ వర్త్ ఇప్పుడు రూ.410 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వరుస బంపర్ హిట్లతో మోహన్‌లాల్ రేంజ్ మరింత పెరిగిపోయింది. వరుసగా ఎల్2 ఎంపురాన్, తుడరుమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మోహన్‌లాల్ నెట్ వర్త్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది
మోహన్‌లాల్ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. ఆయనకు ఊటీలో ఓ ఫ్లాట్ ఉంది. ఇక దుబాయ్ లోనే అత్యంత ఖరీదైన బుర్జ్ ఖలీఫాలో కూడా ఓ ఫ్లాట్ ఉంది. బుర్జ్ ఖలీఫాలోని 29వ ఫ్లోర్ లో మోహన్‌లాల్ అపార్ట్ మెంట్ ఉంది. ఆయన దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. మెర్సిడెజ్ బెంజ్, బీఎమ్ డబ్ల్యూ, జాగ్వర్, రేంజ్ రోవర్ లాంటి రూ.కోట్లు విలువ చేసే కార్లు ఆయనకున్నాయి.
మోహన్‌లాల్ హీరో మాత్రమే కాదు. వర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు. ఆయన సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. సినిమాలను నిర్మించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. అదివెరుకల్, గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, ఉన్నికల్ ఒరు కాద పరయమ్ లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. బారోజ్ మూవీని డైరెక్ట్ చేశారు.
సంబంధిత కథనం