ఒకే సినిమాలో మోహన్‍లాల్‍, అల్లు శిరీష్.. యూట్యూబ్‍లో ఫ్రీగా చూడొచ్చు.. భారత్, పాక్ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో చిత్రం-mohanlal and allu sirish 1971 beyond borders movie telugu dubbing yuddha bhoomi streaming free on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకే సినిమాలో మోహన్‍లాల్‍, అల్లు శిరీష్.. యూట్యూబ్‍లో ఫ్రీగా చూడొచ్చు.. భారత్, పాక్ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో చిత్రం

ఒకే సినిమాలో మోహన్‍లాల్‍, అల్లు శిరీష్.. యూట్యూబ్‍లో ఫ్రీగా చూడొచ్చు.. భారత్, పాక్ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో చిత్రం

సీనియర్ హీరో మోహన్‍లాల్‍తో కలిసి అల్లు శిరీష్ ఓ చిత్రంలో నటించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. ఆ మూవీ ఏది.. ఏ ఛానెల్‍లో ఉందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మోహన్‍లాల్‍, అల్లు శిరీష్ కలిసి నటించిన మూవీ ఏదో తెలుసా!.. యూట్యూబ్‍లో ఉచితంగా చూసేయండి: వివరాలివే

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్‍ హీరోగా 1971: బియాండ్ బార్డర్స్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమా 2017లో మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. 1971లో జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ఆశించిన రిజల్ట్ అందుకుంది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. 1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో యుద్ధ భూమి పేరుతో ఉంది.

యూట్యూబ్‍లో ఫ్రీగా..

1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. భవానీహెచ్‍డీ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో యుద్ధభూమి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని ఉచితంగా చూసేయవచ్చు.

1971: బియాండ్ బార్డర్స్ (యుద్ధభూమి) సినిమాలో కల్నల్ మహదేవన్ పాత్రలో మోహన్‍లాల్ నటించారు. మరో క్యారెక్టర్ కూడా చేశారు. సెకండ్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్ర పోషించారు అల్లు శిరీష్. ఈ మూవీలో అరుణోదయ్ సింగ్, రెంజి పనికర్, దీపక్ జేతి, ఆశా శరత్, ప్రియాంక అగర్వాల్ కీలకపాత్రలు పోషించారు.

యుద్ధం ఆధారంగా..

బంగ్లాదేశ్ విమోచన పోరాటం సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య 1971లో జరిగిన యుద్ధం ఆధారంగా 1971: బియాండ్ బార్డర్స్ చిత్రం రూపొందింది. వార్ థ్రిల్లర్ సినిమాగా డైరెక్టర్ మేజర్ రవి తెరెకెక్కించారు. జార్జియాలోనూ ఈ మూవీ షూటింగ్ జరిగింది. సుమారు రూ.15కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది.

కమర్షియల్ ప్లాఫ్

ఈ సినిమాను రెడ్ రోజ్ క్రియేషన్స్ పతాకంపై ఆండ్రూ జాన్సన్ ప్రొడ్యూజ్ చేశారు. 2017 ఏప్రిల్ 7వ తేదీన ఈ మూవీ మలయాళంల థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలకు తగ్గట్టుగా టాక్ రాలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో సుమారు రూ.10కోట్లనే ఈ చిత్రం దక్కించుకుంది. కమర్షియల్‍గా ప్లాఫ్ అయింది.

1971: బియాండ్ బార్డర్స్ మూవీకి గోపీసుందర్ సంగీతం అందించారు. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సంజిత్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమాను తెలుగు డబ్బింగ్‍లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్‍లో చూసేయవచ్చు. వార్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం మెప్పించవచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం