The 100 Movie: థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే మొగలి రేకులు సాగర్ మూవీకి అవార్డ్
The 100 Movie: మొగలిరేకులు సాగర్ హీరోగా నటిస్తోన్న ది 100 మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే అవార్డులను అందుకున్నది. ఈ సినిమాకు ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు.
The 100 Movie: మొగలి రేకులు ఫేమ్ ఆర్కేనాయుడు (సాగర్) హీరోగా నటించిన ది 100 మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే అవార్డులను అందుకున్నది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ తెలుగు మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
రిలీజ్‌కు ముందే అవార్డులు...
కాగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ది 100 సినిమాకు అవార్డులు వచ్చాయి. ఇటీవల న్యూఢిల్లీలో ప్రజెంట్ చేసిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డులలో ది 100 మూవీకి హానరబుల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా అవార్డులు దక్కించుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ది 100 టీజర్...
ఇటీవల ది 100 మూవీ టీజర్‌ను చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి రిలీజ్ చేసింది. క్రైమ్ అంశాలతో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. నగర శివార్లలోజరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్‌ను ఇన్వేస్టిగేట్ చేసే ఐపీఎస్ ఆఫీసర్‌గా ఈ టీజర్‌లో సాగర్ కనిపించాడు. ఈ టీజర్‌లో తాను పనిచేసే చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి హీరో క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపించారు.
ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో చక్కటి స్పందన లభిస్తోంది. ఈ మూవీలో విక్రాంత్ అనే పాత్రలో సాగర్ కనిపించబోతున్నాడు. హీరోగా సాగర్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేసే మూవీ అవుతోందని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు రిలీజ్ చేశారు.
మిషా నారంగ్ హీరోయిన్...
ది 100 మూవీలో ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మొగిలి రేకులు సీరియల్ ద్వారా..
మొగిలి రేకులు సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సాగర్. ఈ సీరియల్‌కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును అందుకున్నాడు. చక్రవాకం సీరియల్‌లో లీడ్ రోల్ చేశాడు. ఈ రెండు సీరియల్స్ అతడికి బుల్లితెరపై మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.
మనసంతా నువ్వే, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన సాగర్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. 2021లో వచ్చిన ఈ మూవీని దిల్‌రాజు రిలీజ్ చేశాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత సాగర్ ది 100 మూవీ చేస్తోన్నాడు. ది 100తో పాటు బీవీఎస్ రవి బ్యానర్‌లో సాగర్ ఓ మూవీని చేయబోతున్నాడు. హీరోగా ఎనిమిదేళ్ల కెరీర్‌లో సాగర్ మూడు సినిమాలు మాత్రమే చేశాడు.
టాపిక్