OTT Adventure Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ-moana 2 ott streaming animated adventure thriller movie now available for rent on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Adventure Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ

OTT Adventure Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Jan 30, 2025 03:28 PM IST

OTT Adventure Thriller: ఓటీటీలోకి రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.

ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ

OTT Adventure Thriller: వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ మోనా 2 (Moana 2). మోనా సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ రెండో మూవీ గతేడాది నవంబర్ 27న థియేటర్లలో రిలీజై ఏకంగా 102 కోట్ల డాలర్లు (సుమారు రూ.8800 కోట్లు) వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే సినిమా చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

మోనా 2 ఓటీటీ స్ట్రీమింగ్

150 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1300 కోట్లు) బడ్జెట్ తో రూపొందిన మూవీ మోనా 2. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే రూ.389 రెంట్ చెల్లిస్తేనే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ మూవీలో డ్వేన్ జాన్సన్, ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్, రేచెల్ హౌజ్ లాంటి వాళ్లంతా తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ యానిమేటెడ్ మూవీని జేన్ హ్యాండ్, డేవిడ్ డెరిక్ జూనియర్, డానా లెడౌక్స్ మిల్లర్ డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కాగా.. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది.

మోనా 2 మూవీ స్టోరీ ఇదీ..

2016లో వచ్చిన మోనా మూవీకి సీక్వెల్ గా ఈ మోనా 2 వచ్చింది. అప్పట్లోనూ మోనా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. అయితే ఈ సీక్వెల్ అంతకంటే ఎక్కువే వసూళ్లు సాధించడం విశేషం. ఆ తొలి సినిమా ముగిసిన మూడేళ్ల తర్వాత మొదలైన కథగా ఈ మోనా 2 మూవీ మొదలవుతుంది. మోనా2 స్టోరీ చూస్తే ఇందులో మోనా (క్రావాలో), డెమిగాడ్ అయిన మౌయి (డ్వేన్ జాన్సన్) కలిసి శాపగ్రస్తమైన మోటోఫెటు ఐలాండ్ కోసం వేట సాగిస్తారు.

దానికున్న శాపాన్ని తొలగించి ఓషియానిక్ ప్రజలను తిరిగి ఏకం చేయడమే లక్ష్యంగా వీళ్లు ముందుకు సాగుతారు. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.389 రెంట్ కు అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం