Teenmar Mallanna: ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!-mlc teenmar mallanna comments on difference between big small movie in pranaya godari pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Teenmar Mallanna: ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!

Teenmar Mallanna: ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!

Sanjiv Kumar HT Telugu
Dec 11, 2024 02:49 PM IST

Teenmar Mallanna Comments In Pranaya Godari Pre Release Event: సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్స్‌గా నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్రణయ గోదారి. ఇటీవల జరిగిన ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!
ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!

Teenmar Mallanna In Pranaya Godari Pre Release Event: సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'ప్రణయ గోదారి'. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ‘ప్రణయ గోదారి’ చిత్రాన్ని పీఎల్‌వీ క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మించారు.

చిన్నారి గుండె ఆపరేషన్

ప్రణయ గోదారి మూవీ డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహైల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీమ్ అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది.

అనంతరం ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. "ప్రణయ గోదారి చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రసవించే సమయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో.. సినిమా రిలీజ్ టైంలో నిర్మాత కూడా అలానే ఉంటాడనిపించింది" అని అన్నారు.

డాక్యుమెంటరీలు తీశాను

"చిన్న చిత్రమా? పెద్ద సినిమానా? అన్న తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ఉద్యమ సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు నేను కూడా తీశాను. ఈ మూవీ టైటిల్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. డిసెంబర్ 13న రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని తీన్మార్ మల్లన్న తెలిపారు.

అలాగే, ఇదే ఈవెంట్‌లో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "ప్రణయ గోదారి టైటిల్ నాకు చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సినిమాల్లో పెద్దది, చిన్నది అని ఉండదు. పెళ్లి చూపులు చిన్న బడ్జెట్‌లో చేశా. కానీ, దాన్నిపెద్ద హిట్ చేశారు. అందుకే మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటుంది" అని అన్నారు.

మంచి వ్యక్తి

"ప్రణయ గోదారి మంచి చిత్రం అవుతుంది. డైరెక్టర్ విఘ్నేష్ చాలా మంచి వ్యక్తి. మార్కండేయ గారి సంగీతం బాగుంది. ఈ చిత్రానికి మీడియా సహకారం అందించాలి. డిసెంబర్ 13న రానున్న ఈ మూవీని అందరూ చూడండి" అని నిర్మాత రాజ్ కందుకూరి కోరారు.

దర్శక, నిర్మాత విఘ్నేష్ మాట్లాడుతూ.. "మా ఈవెంట్‌కు వచ్చిన తీన్మార్ మల్లన్న, రాజ్ కందుకూరి, సోహెల్ గార్లకు థాంక్స్. నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు" అని తెలిపారు.

మళ్లీ అప్పు చేశాను

"ప్రసాద్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ, రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది" అని దర్శకుడు విఘ్నేష్ వెల్లడించారు.

"పీఆర్ఓ సాయి సతీష్ గారు చిన్న చిత్రాలకు దొరికిన అద్భుతమైన వరం. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండి" అని డైరెక్టర్ విఘ్నేష్ చెప్పుకొచ్చారు.

Whats_app_banner