తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ.. మిత్ర మండలి ట్రైలర్ రిలీజ్.. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా..-mithra mandali trailer promises fun priyadarshi niharika movie to release on 16th october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ.. మిత్ర మండలి ట్రైలర్ రిలీజ్.. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా..

తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ.. మిత్ర మండలి ట్రైలర్ రిలీజ్.. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా..

Hari Prasad S HT Telugu

తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు మిత్ర మండలి. తాజాగా మంగళవారం (అక్టోబర్ 7) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముగ్గురు హీరోల కామెడీతో యూత్ మెచ్చేలా సాగింది.

తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ.. మిత్ర మండలి ట్రైలర్ రిలీజ్.. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా..

తెలుగులో ఇప్పటికే జాతి రత్నాలు, మ్యాడ్ మూవీస్ ఎంతటి సంచలన విజయం సాధించాయో మనకు తెలుసు. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఇప్పుడు మిత్ర మండలి పేరుతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (అక్టోబర్ 7) రిలీజైంది.

మిత్ర మండలి ట్రైలర్ ఎలా ఉందంటే?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో ఈ మిత్ర మండలి మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియదర్శితోపాటు ప్రసాద్ బెహరా, విష్ణు, మయూర్, వెన్నెల కిశోర్, సత్యలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఊహించినట్లే కడుపుబ్బా నవ్వించేలా సాగింది. ఈ ట్రైలర్ మొదట్లోనే సినిమాలోనే లీడ్ పాత్రలను పరిచయం చేశారు.

అది గాలికి తిరిగే బ్యాచ్ అని చూడగానే అర్థమవుతుంది. ఆ ముగ్గురూ ఓ అమ్మాయి వెంట పడటం, అందులో భాగంగా జరిగే ఫన్నీ హింస, గందరగోళం మధ్య ఈ మిత్ర మండలి ట్రైలర్ సాగిపోయింది. రెండు నిమిషాల 40 సెకన్లకుపైగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. మూవీ స్టోరీ కంటే కూడా కేవలం కామెడీనే నమ్ముకొని నడిపించినట్లు స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్లో డైరెక్టర్ అనుదీప్, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం స్పెషల్ అప్పియరెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మిత్ర మండలి మూవీ గురించి..

తెలుగులో కొన్నేళ్లుగా పెద్దగా కథకు ప్రాధాన్యం లేకుండా కేవలం ఓ ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ల మధ్య జరిగే కామెడీ సీన్లతో సినిమాను నడిపించేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన జాతి రత్నాలు, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. దీంతో ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ఈ మిత్ర మండలి సినిమా వస్తోంది.

ప్రియదర్శి, విష్ణు, వెన్నెల కిశోర్ లాంటి కమెడియన్లు ఉండటంతో ఈ సినిమా కూడా కామెడీకి గ్యారెంటీ ఇస్తోంది. విజయేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం