Mission Majnu Movie Review: మిష‌న్ మ‌జ్ను మూవీ రివ్యూ - ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?-mission majnu movie telugu review sidharth malhotra rashmika mandanna spy thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mission Majnu Movie Telugu Review Sidharth Malhotra Rashmika Mandanna Spy Thriller Movie Review

Mission Majnu Movie Review: మిష‌న్ మ‌జ్ను మూవీ రివ్యూ - ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

Nelki Naresh Kumar HT Telugu
Jan 21, 2023 03:38 PM IST

Mission Majnu Movie Review: సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన బాలీవుడ్ సినిమా మిష‌న్ మ‌జ్ను నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న
సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న

Mission Majnu Movie Review: సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన బాలీవుడ్ సినిమా మిష‌న్ మ‌జ్ను థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈసినిమాకు శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నెట్‌ఫ్లిక్ల్‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...

Mission Majnu Movie Story-సీక్రెట్ ఆప‌రేష‌న్‌...

ఇండియాతో జ‌రిగిన మూడు యుద్ధాల్లో పాకిస్థాన్ ఓడిపోతుంది. ఆ ఓట‌మిల‌కు ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటుంది. మ‌రోవైపు లాఫింగ్ బుద్ధ పేరుతో ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం అణుబాంబు ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేస్తుంది. భార‌త్‌కు పోటీగా తాము అటామిక్ బాంబ్‌ను త‌యారు చేయాల‌ని పాకిస్థాన్ నిర్ణ‌యిస్తుంది.ప్ర‌పంచానికి తెలియ‌కుండా ర‌హ‌స్యంగా అణుబాంబ్‌ను త‌యారుచేసే బాధ్య‌త‌ను ఖాన్ అనే సైంటిస్ట్‌కు అప్ప‌గిస్తారు.

అణుబాంబును పాకిస్థాన్‌ ఎక్క‌డ త‌యారు చేస్తున్న‌ద‌నే ర‌హ‌స్యాన్ని తెలుసుకోవ‌డానికి మిష‌న్ మ‌జ్ను పేరుతో సీక్రెట్ ఆప‌రేష‌న్‌ను చేప‌డుతాడు ఇండియ‌న్ స్పై ఏజెంట్ తారిఖ్ (సిద్ధార్థ్‌). పాకిస్థాన్‌లో టైల‌ర్ ప‌నిచేస్తున్న‌ట్లు న‌టిస్తూ త‌న సీక్రెట్ ఆప‌రేష‌న్‌ను తారిఖ్ ఎలా కొన‌సాగించాడు?

పాక్ అట‌మిక్ బాంబ్ త‌యారు చేస్తోన్న ప్రాంతాన్ని అత‌డు ఎలా తెలుసుకున్నాడు? అంధురాలైన న‌స్రీన్‌ను (ర‌ష్మిక మంద‌న్న‌)పెళ్లి చేసుకున్న తారిఖ్ ఆమెను మోసం చేశాడా? ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్‌లో తారిఖ్ ప్రాణాల‌తో పాకిస్థాన్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా లేదా అన్న‌దే (Mission Majnu Movie Review)ఈ సినిమా క‌థ‌.

mission majnu analysis -స్పై థ్రిల్ల‌ర్ ట్రెండ్‌...

గ‌త కొన్నాళ్లుగా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు బాలీవుడ్‌లో స్పై థ్రిల్ల‌ర్ సినిమాల ట్రెండ్ కొన‌సాగుతోంది. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో హీరోయిజాన్ని పండించ‌డానికి ఆస్కారం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ సినిమాల్లో న‌టించ‌డానికి స్టార్స్ ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌చ్చిన తాజా చిత్రం మిష‌న్ మ‌జ్ను.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో...

య‌థార్ఘ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు శంత‌ను బాగ్చి మిష‌న్ మ‌జ్ను సినిమాను తెర‌కెక్కించారు. ర‌హ‌స్యంగా పాకిస్థాన్ చేస్తోన్న అణ్వాయుధ ప‌రీక్ష‌ల స్థావ‌రాన్ని కొనుగొనే ఓ స్ఫై క‌థ ఇది. తాను స్పై ఏజెంట్ అనే విష‌యం రివీల్ కాకుండా పాకిస్థాన్‌లోనే ఉంటూ త‌న ఆప‌రేష‌న్‌ను ఎలా కొన‌సాగించాడ‌న్న‌ది ఈ సినిమాలో చూపించారు. ఓవైపు ర‌హ‌స్య ప‌రిశోధ‌న మ‌రోవైపు అంధురాలైన భార్య‌తో అనుబంధం రెండింటిని స‌మ‌పాళ్ల‌లో ఆవిష్క‌రిస్తూ మిష‌న్ మ‌జ్ను సినిమా సాగుతుంది.

ఆస‌క్తి లోపించింది...

శ‌త్రువుల మ‌ధ్య‌లోనే ఉంటూ వారి ర‌హ‌స్యాల్ని హీరో బ‌య‌ట‌పెట్ట‌డం అనే పాయింట్‌లోనే ఎంతో థ్రిల్‌, స‌స్పెన్స్ ఇమిడి ఉన్నాయి. కానీ ఆ రెండు మిష‌న్ మ‌జ్ను లో లోపించాయి. హీరో ప‌రిశోధ‌న‌ను ద‌ర్శ‌కుడు శంత‌ను బాగ్చి ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. అణు ప‌రిశోధ‌న ఎక్క‌డ జ‌రుపుతున్నార‌నే స‌మాచారాన్ని తారిఖ్‌ సేక‌రించే సీన్స్ (Mission Majnu Movie Review) అన్ని సిల్లీగా ఉంటాయి.

హీరో వేసిన ప్లాన్స్‌లో శ‌త్రువులు ఈజీగా చిక్కుకున్న‌ట్లుగా చూపించడం ఆక‌ట్టుకోదు. ఓ సీన్‌లో హీరో శ‌త్రువుల నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం క‌ళ్ల‌ద్ధాలు ధ‌రించ‌గానే అత‌డిని వారు గుర్తించ‌న‌ట్లుగా చూపించారు. మ‌రోసీన్‌లో పోలీస్ వేషం వేసి సైన్యాన్ని బోల్తా కొట్టించిన‌ట్లుగా ప్రజెంట్ చేశారు. వాటిలో సీరియ‌స్‌నెస్ అస‌లు క‌నిపించ‌దు. సినిమా మొత్తం అలాంటి సీన్స్‌తోనే సాగుతుంది. సిద్ధార్థ్‌, ర‌ష్మిక ఫ్యామిలీ బాండింగ్‌లో ఎమోష‌న్స్ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ర‌ష్మిక క్యారెక్ట‌ర్‌కు సినిమాలో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు.

గూఢ‌చారిగా సిద్ధార్థ్‌...

అమ‌న్‌దీప్ అజిత్ పాల్ సింగ్ అలియాస్ తారిఖ్ అనే గూఢ‌చారిగా సిద్ధార్థ్ మ‌ల్హోత్రా చ‌క్క‌గా న‌టించాడు. దేశ‌ద్రోహి కొడుకుగా అవ‌మానాలు భ‌రిస్తూనే దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ‌ప‌డే గూఢ‌చారి పాత్ర‌లో ఒదిగిపోయాడు. న‌స్రీన్ అనే అంధురాలిగా ర‌ష్మిక మంద‌న్న క‌నిపించింది. త‌న యాక్టింగ్ టాలెంట్ చాటే అవ‌కాశం ఆమెకు ద‌క్క‌లేదు. వీరి త‌ర్వాత ష‌రీబ్ హ‌ష్మి, కుముద్ మిశ్రా పాత్ర‌ల‌కు ఎక్కువగా సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది.

Mission Majnu Movie Review -ఫ్యాన్స్‌ను మెప్పించ‌డం క‌ష్ట‌మే...

మిష‌న్ మ‌జ్ను పాయింట్ బాగున్నా ప్ర‌జంటేష‌న్ మాత్రం పూర్తిగా నిరాశ‌ప‌రుస్తుంది. సిద్ధార్థ్‌, ర‌ష్మిక ఫ్యాన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పించ‌డం క‌ష్ట‌మే...

IPL_Entry_Point