రూ.5 వేల కోట్ల హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్-mission impossible the final reckoning ott release date amazon prime video apple tv to stream from 19th august ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రూ.5 వేల కోట్ల హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

రూ.5 వేల కోట్ల హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, బాక్సాఫీస్ దగ్గర రూ.5 వేల కోట్లకుపైగా వసూలు చేసిన మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ స్ట్రీమింగ్ చేయనున్నాయి.

రూ.5 వేల కోట్ల హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

హాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి మిషన్ ఇంపాజిబుల్. టామ్ క్రూజ్ లీడ్ రోల్లో వచ్చిన ఈ హిట్ ఫ్రాంఛైజీ నుంచి ఈ మధ్యే ది ఫైనల్ రెకనింగ్ వచ్చిన విషయం తెలిసిందే. 2023లో వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రెక్నింగ్ పార్ట్ వన్' సినిమాకు సీక్వెల్‌గా.. 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో 8వ భాగం అయిన 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. మే 2025లో థియేటర్లలో విడుదలైన ఈ టామ్ క్రూజ్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తోంది.

మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రెకనింగ్ ఓటీటీ

పారామౌంట్ పిక్చర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' ఆగస్టు 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమాను రెంట్ విధానంలో చూడొచ్చు. ఈ విషయాన్ని 'మిషన్ ఇంపాజిబుల్' అధికారిక ఎక్స్ హ్యాండిల్ కూడా షేర్ చేసింది.

"ప్రపంచవ్యాప్తంగా, మీరు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ ను ఆగస్టు 19 నుండి డిజిటల్‌లో చూడండి. ప్రస్తుతం థియేటర్లలో చూడండి" అని క్యాప్షన్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.5 వేల కోట్లకుపైగా వసూలు చేసిని సినిమా ఇది.

మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ గురించి..

మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ సినిమాలో ఈథన్ హంట్, అతని ఐఎంఎఫ్ బృందం 'ది ఎంటిటీ' అనే ఒక తిరుగుబాటు ఏఐని ఎదుర్కొంటారు. ఈ 'ఎంటిటీ' ప్రపంచ గూఢచార నెట్‌వర్క్‌లలోకి చొరబడి, సమాచారాన్ని తారుమారు చేయడం ద్వారా ప్రపంచ అణు యుద్ధానికి దారితీసేలా హెచ్చరిస్తుంది. సమయం మించిపోకముందే హంట్ ఆ ఎంటిటీ సోర్స్ కోడ్‌ను కనుగొని, దానిని పని చేయకుండా చేయడానికి ఒక మార్గాన్ని వెతకాలి.

ఎంటిటీని ఎదుర్కోవడానికి ఈ బృందం ఒక 'పాయిజన్ పిల్ మాల్వేర్'ను సృష్టిస్తుంది. కానీ వారు ఎంటిటీ చర్యల పరిణామాలను, అణు విధ్వంసం ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సినిమాలో బెంజి, లూథర్, గ్రేస్ వంటి పాత పాత్రలతో పాటు, గాబ్రియెల్ సహా కొత్త మిత్రులు, శత్రువులు కూడా ఉన్నారు.

'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్'ను స్కైడాన్స్ మీడియా, టీసీ ప్రొడక్షన్స్, పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్‌ల కింద టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్‌క్వారీ, జేక్ మైయర్స్ నిర్మించారు. టామ్ క్రూజ్‌తో పాటు ఈ మూవీలో హేలీ అట్‌వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఈసాయ్ మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్‌, హెన్రీ కెజర్నీ, హోల్ట్ మెక్‌కాల్నీ, జానెట్ మెక్‌టీర్, నిక్ ఆఫర్‌మాన్, ట్రమెల్ టిల్మాన్, షీ విగ్‌హామ్, ఏంజెలా బాసెట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం