హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు ఇండియాలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ లో టామ్ క్రూజ్ స్టంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. యాక్షన్ లవర్స్ కు ట్రీట్ లాంటి ఈ ఫ్రాంఛైజీలో చివరి సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ థియేటర్లకు వచ్చేసింది. వస్తూనే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది.
ఇంకా అమెరికాలో రిలీజ్ కాని ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ మూవీ ముందుగా ఇండియాలోకి వచ్చేసింది. శనివారం (మే 17) థియేటర్లలో రిలీజైన ఈ టామ్ క్రూజ్ యాక్షన్ మూవీ వీకెండ్ లో అదుర్స్ అనిపించింది. రెండు రోజుల్లో ఈ మిషన్ ఇంపాజిబుల్ 8 సినిమా రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.
టామ్ క్రూజ్ సినిమా అది కూడా మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ ముందు నుంచే ఇంట్రెస్ట్ తో ఉన్నారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఈ కారణంతోనే తొలి రెండు రోజుల్లో టామ్ క్రూజ్ సినిమా రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది. శని, ఆదివారాల్లో ఈ సినిమా రూ.16.5 కోట్ల చొప్పున నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ తో స్టార్ హీరో టామ్ క్రూజ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. 2025లో ఇండియాలో తొలి రెండు రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా మిషన్ ఇంపాజిబుల్ 8 నిలిచింది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడీనెస్, మార్వెల్స్ థండర్ బోల్ట్స్ సినిమాలను వెనక్కినెట్టింది. ఇక మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే.
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ లో టామ్ క్రూజ్ యాక్షన్ సీక్వెన్స్ మరో రేంజ్ లో ఉన్నాయి. 62 ఏళ్ల వయసులోనూ టామ్ క్రూజ్ అదరగొట్టాడు. ఏఐ సాయంతో ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే ముఠాపై పోరాటానికి దిగి, హీరో ఎలా విజయం సాధించాడన్నదే ఈ మూవీ కథ. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. మరి మండే రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో వచ్చిన గత చిత్రం రూ.110 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్లు రాబట్టింది. మరి మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో లాస్ట్ సినిమాతో ఆ రికార్డును టామ్ క్రూజ్ దాటేస్తాడా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
సంబంధిత కథనం