మండే ఎఫెక్ట్.. మిషన్ ఇంపాజిబుల్ 8కు షాక్.. టామ్ క్రూజ్ సినిమాకు మూడో రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?-mission impossible the final reckoning box office collections day 3 tom cruise movie dip on monday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మండే ఎఫెక్ట్.. మిషన్ ఇంపాజిబుల్ 8కు షాక్.. టామ్ క్రూజ్ సినిమాకు మూడో రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

మండే ఎఫెక్ట్.. మిషన్ ఇంపాజిబుల్ 8కు షాక్.. టామ్ క్రూజ్ సినిమాకు మూడో రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ కలెక్షన్లపై మండే ఎఫెక్ట్ పడింది. వీకెండ్ తో పోల్చుకుంటే మూడో రోజు వసూళ్లు గణనీయంగా తగ్గాయి. అయినా టామ్ క్రూజ్ హాలీవుడ్ మూవీ కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది.

టామ్ క్రూజ్ (x/TomCruise)

హాలీవుడ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ మూవీ కలెక్షన్లపై మండే ఎఫెక్ట్ పడింది. మూవీ రిలీజైన మూడో రోజు వసూళ్లు తగ్గాయి. వీకెండ్ జోష్ తో ఉన్న ఈ టామ్ క్రూజ్ మూవీ ఫస్ట్ మండే రోజు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మే 19న మిషన్ ఇంపాజిబుల్ 8 మూవీ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

రూ.6.75 కోట్లు

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ మూడో రోజు రూ.6.75 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సక్నిల్క్ పేర్కొంది. మే 19వ తేదీన కలెక్షన్లు తగ్గినట్లు తెలిపింది. దీంతో మే 17న రిలీజైన టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ కలెక్షన్లు మూడు రోజుల్లో రూ.40.25 కోట్లకు చేరాయి.

ఆక్యుపెన్సీ ఇలా

వీక్ డే కావడంతో సోమవారం మిషన్ ఇంపాజిబుల్ 8 సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. మే 19న ఓవరాల్ ఆక్యుపెన్సీ 15.65 శాతంగా నమోదైందని సక్కిల్న్ వెల్లడించింది. మార్నింగ్ షోకు 8.55, మధ్యాహ్నం షోకు 15.52, ఫస్ట్ షో కు 17.09, సెకండ్ షోకు 21.44 శాతం ఆక్యుపెన్సీగా ఉంది.

రెండు రోజుల్లోనే

టామ్ క్రూజ్ సినిమా అది కూడా మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ ముందు నుంచే ఇంట్రెస్ట్ తో ఉన్నారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఈ కారణంతోనే తొలి రెండు రోజుల్లో టామ్ క్రూజ్ సినిమా రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది. శనివారం రూ.16.5 కోట్లు, ఆదివారం రూ.17 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ.33.5 కోట్లు సొంతం చేసుకుంది.

టామ్ క్రూజ్ రికార్డు

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ తో స్టార్ హీరో టామ్ క్రూజ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. 2025లో ఇండియాలో తొలి రెండు రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా మిషన్ ఇంపాజిబుల్ 8 నిలిచింది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడీనెస్, మార్వెల్స్ థండర్ బోల్ట్స్ సినిమాలను వెనక్కినెట్టింది. ఇక మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే.

ఆ కలెక్షన్లు దాటేనా?

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ లో టామ్ క్రూజ్ యాక్షన్ సీక్వెన్స్ మరో రేంజ్ లో ఉన్నాయి. 62 ఏళ్ల వయసులోనూ టామ్ క్రూజ్ అదరగొట్టాడు. ఏఐ సాయంతో ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే ముఠాపై పోరాటానికి దిగి, హీరో ఎలా విజయం సాధించాడన్నదే ఈ మూవీ కథ. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. మరి మండే రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో వచ్చిన గత చిత్రం రూ.110 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్లు రాబట్టింది. మరి మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో లాస్ట్ సినిమాతో ఆ రికార్డును టామ్ క్రూజ్ దాటేస్తాడా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం