NeeDhaarey Nee Katha: తెలుగు సినిమాకు పనిచేసిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ టీమ్ - నీ దారే నీ కథ టీజర్ రిలీజ్
NeeDhaarey Nee Katha: తెలుగు మూవీ నీ దారే నా కథకు మిషన్ ఇంపాజిబుల్, పారాసైట్ సినిమాలకు బీజీఎమ్ అందించిన ఆర్కెస్ట్రా టీమ్ పనిచేసింది. మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వంశీ జొన్నలగడ్డ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
NeeDhaarey Nee Katha: పారాసైట్, మిషన్ ఇంపాజిబుల్ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ టీమ్ తెలుగు మూవీ నీ దారే నీ కథకు పనిచేశారు. నీ దారే నీ కథ సినిమాలో ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ హీరోహీరోయిన్లుగా నటించాడు. జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ దర్శకనిర్మాతగా ఈ మూవీ తెరకెక్కుతోంది. నీ దారే నీ కథ టీజర్ ఇటీవల రిలీజైంది.
మ్యూజికల్ మూవీ...
మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీమ్ బ్యాక్‌డ్రాప్‌లో నీ దారే నీ కథ సినిమా తెరకెక్కుతోంది. ఓ మ్యూజిక్ కాంపిటీషన్‌లో విజయం సాధించే ప్రయత్నంలో అర్జున్ అనే యువకుడితో పాటు అతడి టీమ ఎదుర్కొన్న సంఘటనలతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు టీజర్ లో చూపించారు. టీజర్‌లోని డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి.టీజర్‌లో ఆర్కెస్ట్రా నేపథ్యంలో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్‌గా టీజర్‌ను కట్ చేశారు. ప్రధాన పాత్రదారులందరూ కొత్తవాళ్లే కనిపించారు.
ఫస్ట్ మూవీ...
నీ దారే నీ కథ గురించి నిర్మాతలు తేజేస్, శైలజ మాట్లాడుతూ...ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం కలిసి ...నూతన నటీనటులతో ఈ సినిమాని నిర్మించాం. ప్రొడ్యూసర్లుగా ఇదే మా మొదటి సినిమా. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా కొత్తగా తెరకెక్కించాం. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది.
స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్…
బుడాపెస్ట్ లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి గతంలో మిషన్ ఇంపాజిబుల్, పారసైట్ వంటి సినిమాలతో పాటు, స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్‌కు బీజీఎమ్ అందించిన అలెగ్జాండర్ మ్యూజిక్, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాయి. వారి మ్యూజిక్ తెలుగు ఆడియెన్స్‌ను అలరిస్తుందని నిర్మాతలు చెప్పారు.
హాలీవుడ్ స్టాండర్డ్స్ తో…
దర్శకనిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ... న్యూయార్క్ లో డైరెక్షన్ కోర్సు చదువుతున్నప్పుడే ఈ స్క్రిప్ట్ రాసుకున్నా. మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. కంప్లీట్ సింక్ సౌండ్‌తో ఈ సినిమాను షూట్ చేశాడు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా సినిమా ఉంటుంది. సినిమా చూసే ప్రతి ఆడియెన్ కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అని అన్నారు.
నీ దారే నా కథ సినిమాలో సీనియర్ హీరో సురేష్ కీలక పాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత అతడు నటించిన తెలుగు మూవీ ఇది. నీ దారే నీ కథలో అజయ్, పోసాని కృష్ణమురళీ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించారు. త్వరలోనే థియేటర్ల ద్వారా నీ దారే నీ కథ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీ దారే నీ కథ సినిమాకు ఆల్బర్ట్టో గురియోలి సంగీతం అందిస్తున్నాడు.