బాలీవుడ్ పై మనసు పారేసుకున్న ప్రపంచ సుందరి.. అదో అద్భుత అవకాశమంటూ కామెంట్లు.. ఆతిథ్యంపై ఒపాల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు-miss world opal suchata interesting comments on bollywood movies great chance to act indian hospitality ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బాలీవుడ్ పై మనసు పారేసుకున్న ప్రపంచ సుందరి.. అదో అద్భుత అవకాశమంటూ కామెంట్లు.. ఆతిథ్యంపై ఒపాల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

బాలీవుడ్ పై మనసు పారేసుకున్న ప్రపంచ సుందరి.. అదో అద్భుత అవకాశమంటూ కామెంట్లు.. ఆతిథ్యంపై ఒపాల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

మిస్ వరల్డ్ 2025 ఒపాల్ సుచత బాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. హిందీ సినిమాలపై ప్రపంచ సుందరి మనసు పారేసుకుంది. ఆమె ఇంకేమన్నారో చూసేయండి.

ప్రపంచ సుందరి ఒపాల్ సుచత (REUTERS)

ప్రపంచ సుందరి ఒపాల్ సుచత బాలీవుడ్ పై మనసు పారేసుకుంది. థాయ్ లాండ్ కు చెందిన ఈ మిస్ వరల్డ్ 2025 హిందీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. భారత ఆతిథ్యం గురించి కూడా మాట్లాడింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె తన భారత పర్యటన గురించి మాట్లాడుతూ.. "ఖచ్చితంగా భారత్ కు తిరిగి వస్తాను" అని పేర్కొంది.

కచ్చితంగా నటిస్తా

బాలీవుడ్ సినిమాల గురించి ఒపాల్ సుచత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. "నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎంతో గర్వంగా ఉంది. థాయ్ లాండ్ కు తొలి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోవడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నా. నా దేశ ప్రజలను గర్వపడేలా చేశానని అనుకుంటున్నా. అవకాశం వస్తే బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఇష్టపడతా. అదొక అద్భుతమైన అవకాశం’’ అని ఒపాల్ చెప్పింది. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తే బాలీవుడ్ పై మనసు పారేసుకుందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఒపాల్ ను హిందీ సినిమాల్లో చూసే అవకాశముంది.

ఇండియా ఎక్స్ పీరియన్స్

భారత్ లో తన అనుభవాన్ని ఒపాల్ సుచత పంచుకుంది. ‘‘నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి అందరూ చాలా బాగున్నారు. ప్రజలు అద్భుతంగా ఉన్నారు. నా పట్ల గొప్పగా ప్రవర్తించారు. మేము చాలా ప్రదేశాలకు వెళ్లాం. మౌలిక సదుపాయాలైనా, ప్రకృతి అయినా ఎంతో అందంగా ఉన్నాయి. ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేను ఖచ్చితంగా ఇండియాకు తిరిగి వస్తా" అని ఒపాల్ తెలిపింది.

బటర్ చికెన్

‘‘ఉత్తమ వసతి కల్పించి, ఇంత గొప్ప సమయాన్ని గడిపే ఛాన్స్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడి ప్రజలందరికీ థ్యాంకు యూ’’ అని ఒపాల్ సుచత పేర్కొంది. మరోవైపు మిస్ వరల్డ్ అమెరికా 2025 జెస్సికా పెడ్రోసో హైదరాబాద్, ఇక్కడి సంస్కృతి, ప్రజలు, ఆహారంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని ఆమె పేర్కొంది. చాలా అద్భుతమైన బటర్ చికెన్ ట్రై చేశానని జెస్సికా తెలిపింది.

మిస్ ఇండియా ఇలా

ఇండియాకు చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ టాప్ 8 ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. గత రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో టాప్ 40లో చోటు దక్కించుకున్న ఆమె ఈ ప్రతిష్టాత్మక కేటగిరీకి 'ఫాస్ట్ ట్రాక్' చేసిన 18 మంది కంటెస్టెంట్లలో ఒకరు. అయితే పోటీ పెరగడంతో ఆమె ఫైనల్ కు చేరుకోలేకపోయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం