Telugu OTT: అక్కినేని హీరోతో మిస్ యూనివర్స్ తెలుగు మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్!
Miss Universe: ఈటీవీ విన్ ఓటీటీ కోసం అక్కినేని హీరో సుమంత్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో సుమంత్‌కు జోడీగా మిస్ యూనివర్స్ బీహార్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
Miss Universe: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా గత కొన్నాళ్లుగా ప్రయోగాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. తాజాగా సుమంత్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల మొదలైంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో సుమంత్‌కు జోడీగా మిస్ యూనివర్స్ బీహార్ 2024 కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె కాజల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ...
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సుమంత్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈటీవీ విన్ ఓటీటీ ఈ తెలుగు సినిమాను నిర్మిస్తోంది. రాకేష్ ప్రొడ్యూస్. బాలనటుడు విహర్ష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లాంఛింగ్ ఫొటోలను ఈటీవీ విన్ ఓటీటీ ట్విట్టర్‌లో పోస్ట్‌చేసింది.
ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది అంటూ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించింది. ఈ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలోనే రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
మిస్ యూనివర్స్...
కాజల్ చౌదరి ఈ ఏడాది మిస్ యూనివర్స్ బీహార్ టైటిల్ గెలుచుకున్నది. పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్న కాజల్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్నది. కవితలు రాయడమే కాకుండా పాటలు పాడగలదు. డ్యాన్స్‌లో దిట్టే.
సుమంత్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న కాజల్ ఓ తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇండియా నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించనుంది కాజల్. అందాల పోటీల్లో బీహార్ నుంచి పాల్గొననున్న తొలి కంటెస్టెంట్‌గా కాజల్ రికార్డ్ నెలకొల్పనుంది.
బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్...
మరోవైపు కెరీర్ ఆరంభంలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో సినిమాల స్పీడును తగ్గించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ రావాతో ప్రేక్షకులను మెప్పించాడు. గత కొన్నాళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సుమంత్.
మహేంద్రగిరి వారాహి...
ప్రస్తుతం సుమంత్ మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోగానే కాకుండా స్టార్ హీరోల సనిమాల్లో కీలక పాత్రలు చేస్తోన్నాడు సుమంత్. దుల్కర్ సల్మాన్ సీతారామం, ధనుష్ సార్ సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు.
టాపిక్