Miss Shetty Mr Polishetty Song: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి నో నో నో సాంగ్ అదుర్స్
Miss Shetty Mr Polishetty Song: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి నో నో నో సాంగ్ అదుర్స్ అనిపించేలా ఉంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి.
Miss Shetty Mr Polishetty Song: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ మొదటి నుంచీ వెరైటీగా ప్రమోషన్లు చేస్తోంది. అసలు ఈ సినిమా టైటిల్ నే చాలా డిఫరెంట్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడిక ఈ మూవీ నుంచి నో నో నో అనే సాంగ్ రిలీజైంది. ఈ పాట కూడా డిఫరెంట్ ట్యూన్స్ తో అలరిస్తోంది. ఇది నవీన్, అనుష్క మధ్య లవ్ ట్రాక్ లా కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఫంకీ స్టైల్లో మంచి ఎనర్జీ ఇచ్చేలా ఈ పాట సాగింది. రాధన్ ఈ సాంగ్ కంపోజ్ చేశారు. యూత్ లక్ష్యంగా ఈ పాట కంపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను ఎంఎం మనది పాడారు. పాట ట్యూన్ తోపాటు మధ్యలో వచ్చే ర్యాప్ కూడా క్యాచీగా ఉన్నాయి. ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తుండగా.. వంశీ, ప్రమోద్, విక్రమ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేశారు.
ఆ మధ్య ఈ సినిమా టైటిల్ ను కూడా వెరైటీగా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనుష్క శెట్టిలోని శెట్టిని, నవీన్ పోలిశెట్టిలోని పోలిశెట్టిని తీసుకునే టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. ఈ సందర్భంగా నవీన్, అనుష్క కలిసి ఉన్న ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క మాస్టర్ చెఫ్ గా చేస్తుండగా.. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నాడు.
ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ వెరైటీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఇందులో నవీన్.. అనుష్క పోస్టర్ తో మాట్లాడుతూ కనిపిస్తాడు. మన సినిమాకు ఏం టైటిల్ పెడదాం.. చాలా టైటిల్స్ సజెస్ట్ చేస్తున్నారు.. ఏదైతే బాగుంటుందో చెప్పమని అనుష్కను అడుగుతాడు నవీన్. దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. స్వీటీతో ఎవడీ క్యూటీ.. టైటిల్స్ ఎలా ఉన్నాయంటూ అతడు అడగడం నవ్వు తెప్పిస్తుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా పరిచయమైన నవీన్ మంచి కామెడీ టైమింగ్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. జాతిరత్నాలు మూవీతో అతని రేంజ్ మరో స్థాయికి వెళ్లింది. ఇప్పుడు అనుష్కతో కలిసి అతడు నటిస్తున్నాడు.