Miss Shetty Mr Polishetty BO Collection: పడిపోయిన కలెక్షన్స్.. 8వ రోజు ఇంతే.. లాభాలు మాత్రం!
Miss Shetty Mr Polishetty 8 Days Collection: సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. వీటిలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 8 డేస్ కలెక్షన్స్ చూస్తే..
ప్రీ రిలీజ్ బిజినెస్
ట్రెండింగ్ వార్తలు
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి తొలిసారిగా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్‍గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే దీనికి మంచి మార్కెట్ కూడా జరిగింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 12.50 కోట్లకు సేల్ కాగా.. రూ. 13.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని సుమారు 800 థియేటర్లలో రిలీజ్ చేశారు.
8వ రోజు కలెక్షన్స్
పెళ్లికి ముందు సరోగసీ ద్వారా బిడ్డను కనడం వంటి సరికొత్త కథాంశంతో వచ్చిన సినిమాకు కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఇందులో కామెడీ ట్రాక్ అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. ఇలా ఈ సినిమాకు 8వ రోజున అంటే గురువారం నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‍లో రూ. 4 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 18 లక్షలు వచ్చాయి. అంటే 8వ రోజు వసూళ్లు పడిపోయాయి. కానీ, మొత్తంగా రూ. 44 లక్షల షేర్, రూ. 75 లక్షల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
8 రోజులకు కలిపి
అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి 8 రోజుల్లో నైజాంలో రూ. 5.48 కోట్లు, సీడెడ్‍లో రూ. 89 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 3.57 కోట్లు వచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.94 కోట్లు షేర్, రూ. 17.50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అలాగే, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్ రూ. 6.10 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇలా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 17.39 కోట్ల షేర్, 33.65 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్-లాభాలు
అనుష్క, నవీన్ కాంబినేషన్‍లో మహేష్ బాబు పి దర్శకత్వంలో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు వరల్డ్ వైడ్‍గా రూ. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అలాగే, 8 రోజుల్లో రూ. రూ. 17.39 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే టార్గెట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకా రూ. 3.89 కోట్లు ప్రాఫిట్ వచ్చింది.