Miss Perfect Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ వినూత్న ప్రమోషన్.. లావణ్యతో చీపురు పట్టిస్తున్నారు-miss perfect web series actress lavanya tripathi to clean vizag beach ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Perfect Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ వినూత్న ప్రమోషన్.. లావణ్యతో చీపురు పట్టిస్తున్నారు

Miss Perfect Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ వినూత్న ప్రమోషన్.. లావణ్యతో చీపురు పట్టిస్తున్నారు

Hari Prasad S HT Telugu
Jan 26, 2024 08:28 PM IST

Miss Perfect Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠీ ప్రమోషన్లలో భాగంగా చీపురు పడుతోంది. విశాఖ బీచ్ ను క్లీన్ చేయడానికి నడుం బిగిస్తోంది.

లావణ్య త్రిపాఠీ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్
లావణ్య త్రిపాఠీ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్

Miss Perfect Lavanya Tripathi: మెగా ఇంటి కోడలు, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠీ త్వరలోనే మిస్ పర్ఫెక్ట్ గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలుసు కదా. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఇప్పుడు వినూత్నంగా ప్రమోషన్లు చేపట్టింది.

ఇందులో భాగంగా ఆదివారం (జనవరి 28) విశాఖ బీచ్ ను స్థానికులతో కలిసి లావణ్య క్లీన్ చేయనుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా వెల్లడించింది.

చీపురు పట్టనున్న మిస్ పర్ఫెక్ట్

గతేడాది వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూపొందించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెడుతోంది. ఎప్పుడూ పరిశుభ్రత విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే మహిళ పాత్రలో లావణ్య ఈ సిరీస్ లో నటించింది. లావణ్య రావు అనే పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగా ఆదివారం (జనవరి 28) లావణ్య.. విశాఖపట్నంలోని వైఎంసీఏ దగ్గర బీచ్ క్లీనింగ్ లో పాల్గొంటోంది. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్ లో భాగంగా స్థానికులతో కలిసి ఆమె బీచ్ శుభ్రం చేయనుంది. జాతీయ పరిశుభ్రత దినోత్సవాలను పురస్కరించుకొని ఈ బీచ్ క్లీనింగ్ ప్రక్రియ సాగనుంది. మిస్ పర్ఫెక్ట్ సిరీస్ లో తాను పోషించిన పాత్రను ఇప్పుడు లావణ్య నిజ జీవితంలోనూ పోషించబోతోంది.

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా లావణ్య.. ఈ మధ్యే ప్రొ కబడ్డీ లీగ్ కూ వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో అక్కడ తెలుగు టైటన్స్ ను చీర్ చేయడానికి లావణ్య వెళ్లింది. టీమ్ ను ఎంకరేజ్ చేయడంతోపాటు తన సిరీస్ ప్రమోషన్లలోనూ పాల్గొన్నది.

మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ఏంటి?

లావణ్య త్రిపాఠీ నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‍కు స్కైలాబ్ ఫేమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. బిగ్‍బాస్ ఫేమ్ అభిజిత్ ఈ సిరీస్‍లో మరో ప్రధాన పాత్ర పోషించాడు.

ఈ సిరీస్ ట్రైలర్ జనవరి 22న రిలీజైంది. ‘మిస్ పర్‌ఫెక్ట్’ సిరీస్‍లో లావణ్య శుభ్రత అంటే ప్రాణమిస్తుంది. అభిజిత్ మాత్రం క్లీన్‍నెస్‍ను పట్టించుకోడు. ఎట్టకేలకు ఒకరింటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సిరీస్ ప్రధాన కథలా కనిపిస్తోంది. రోమ్ కామ్‍గా వస్తున్న ‘మిస్ పర్‌ఫెక్ట్’ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్‍లో లావణ్య త్రిపాఠి, అభిజిత్‍తో పాటు అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‍ను నిర్మించారు. ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024