Mirai Release Date Official Announcement: యంగ్ స్టార్ తేజ సజ్జా దేశంలో సూపర్ హీరో స్టయిల్ రీడిఫైన్ లక్ష్యంతో ఉన్నారు. హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అఖండ విజయంతో దూసుకుపోతున్న తేజ సజ్జా తన నెక్ట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిరాయ్' తో మరోసారి అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ సినిమా మిరాయ్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర సూపర్ హీరో స్టయిల్‌లో ఎగ్జయిటింగ్, డైనమిక్‌గా ఉండనుందని మేకర్స్ తెలిపారు. మిరాయి సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ మిరాయ్ మూవీని నిర్మిస్తున్నారు.
అయితే, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం మిరాయ్ రిలీజ్ డేట్‌ను తాజాగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మిరాయ్ సినిమాను ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అలాగే, మిరాయ్ మూవీని 8 వేర్వేరు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
అన్ని ప్రేక్షకుల వర్గాలను ఆకట్టుకునే విధంగా మిరాయ్ సినిమాను 2D, 3D ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రక్షా బంధన్, స్వాతంత్య్ర దినోత్సవ సెలవులు దగ్గరగా వస్తున్నందున మిరాయ్ ఫెస్టివల్ స్పిరిట్‌ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక మిరాయ్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.
మిరాయ్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్‌లోనే సినిమా గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది. మిరాయ్‌లో అద్భుతమైన తారాగణం ఉంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మెమరబుల్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. తేజ సజ్జా అంకితభావం, కృషి ఈ చిత్రం ప్రోమోలలో స్పష్టంగా కనిపిస్తాయి. సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసేందుకు తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రంగా మలుస్తున్నారు. స్క్రీన్‌పై పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ప్రమోషనల్ మెటీరియల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని అందిచడంతో పాటు డైలాగ్స్ రాస్తున్న మణిబాబు కరణంతో కలసి స్క్రీన్‌ప్లే రాశారు. మిరాయ్ సినిమాకు గౌరహరి సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల, సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
సంబంధిత కథనం
టాపిక్