ఇవాళ ఓటీటీలోకి మిరాయ్.. 9 గ్రంథాల ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్.. అదిరే విజువల్స్.. నాలుగు భాషల్లో.. విలన్ గా మంచు మనోజ్-mirai ott release date this fantasy adventure thriller streaming on jiohotstar from today ott releases teja sajja manoj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇవాళ ఓటీటీలోకి మిరాయ్.. 9 గ్రంథాల ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్.. అదిరే విజువల్స్.. నాలుగు భాషల్లో.. విలన్ గా మంచు మనోజ్

ఇవాళ ఓటీటీలోకి మిరాయ్.. 9 గ్రంథాల ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్.. అదిరే విజువల్స్.. నాలుగు భాషల్లో.. విలన్ గా మంచు మనోజ్

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ ఫాంటసీ చిత్రంలో తేజ సజ్జ, మంచు మనోజ్, రితికా నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆన్‌లైన్‌లో ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

మిరాయ్ పోస్టర్ తో తేజ సజ్జా

మిరాయ్ OTT రిలీజ్: తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీక్ ఘట్టమనేని ఫాంటసీ యాక్షన్ చిత్రం 'మిరాయ్' ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఇవాళ (అక్టోబర్ 10) మిరాయ్ ఓటీటీ డెబ్యూ చేసింది.

మిరాయ్ ఓటీటీ

తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మిరాయ్ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెల రోజుల్లోనే ఓటీటీలో

రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిరాయ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజైంది. గ్రాండ్ విజువల్స్, స్టోరీ లైన్, బ్లాక్ స్వార్డ్ గా మంచు మనోజ్, తేజ సజ్జా హీరోగా యాక్షన్ కలిసి మూవీకి పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి నెల రోజుల్లోపే వచ్చేసింది. అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

సీక్వెల్ కూడా

అశోకుడి 9 గ్రంథాలను చేజిక్కించుకుని, ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలని మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వార్డ్ ట్రై చేస్తాడు. అతణ్ని ఆపడానికి సూపర్ యోధ వేద పోరాడతాడు. మిరాయ్ చిత్రానికి కార్తీక్ దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇందులో తేజ సజ్జ, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, శ్రియా శరన్, రితికా నాయక్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

మిరాయ్ కథ ఏమిటంటే?

అశోకుని 9 గ్రంథాలను దక్కించుకుని ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వోర్డ్ (మంచు మనోజ్), ఆ ప్రయత్నాన్ని ఆపాలనుకునే వేద (తేజ సజ్జా)కు మధ్య పోరాటమే మిరాయ్. మహాబీర్ లామా క్రూరంగా అందరనీ చంపేస్తూ 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. కానీ 9వ గ్రంథం దక్కకుండా వేద అడ్డుగా నిలుస్తాడు. అందుకు రాముని ఆయుధం మిరాయ్ ను చేరుకుంటాడు.

మరి మహాబీర్ లామా 9 గ్రంథాలను దక్కించుకున్నాడా? అతణ్ని తేజ సజ్జా ఎలా ఆదుకున్నాడు? ఇందులో వేద తల్లి అంబిక ప్రజాపతి (శ్రియా సరణ్) చేసిన త్యాగం ఏంటీ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం