ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ జోనర్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇదంతా ఎక్కువగా మొదలైంది దృశ్యం సినిమాతో అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ జోనర్స్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ దృశ్యం అండ్ దృశ్యం 2.
ఈ రెండు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ దృశ్యం సిరీస్‌తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన దృశ్యం 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, దృశ్యం 3 కంటే ముందుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది.
ఆ మూవీనే మిరాజ్. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. హీరో సూర్య నటించిన ఆకాశమే హద్దురా సినిమాతో అపర్ణ బాలమురళి తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. జీతూ జోసెఫ్, అపర్ణ బాలమురళి కాంబినేషన్‌లో తెరకెక్కిన మిరాజ్ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం థ్రిల్లర్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు మిరాజ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. మలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మిరాజ్ అక్టోబర్ 20 నుంచి ఓటీటీ ప్రీమియర్ కానుంది.
ప్రముఖ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మిరాజ్ ఓటీటీ రిలీజ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సాధించిన మిరాజ్ మూవీని అక్టోబర్ 20 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.
ఇక మిరాజ్ కథ విషయానికొస్తే.. అభిరామి (అపర్ణ బాలమురళి) తన లవర్ కిరణ్ (హకీమ్ షాజహాన్)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి అభిరామికి కాల్ వస్తుంది. దాంతో పీఎస్‌కు వెళ్లిన అభిరామికి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దాంతో షాక్‌లోకి వెళ్తుంది అభిరామి.
ఆ షాక్ నుంచి తేరుకోకముందే అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి పోలీస్ నుంచి రౌడీ వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్‌ది నిజంగా యాక్సిడెంటా? అభిరామిని అడిగిన హార్డ్ డిస్క్‌లో ఏముంది? అభిరామికి ఎదురైన ప్రమాదం ఏంటీ? దాని నుంచి తప్పించుకుందా? అనేటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిరాజ్ తెరకెక్కింది.
సంబంధిత కథనం