Mimoh Chakraborty About Prabhas Pawan Kalyan: బాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగు వెలిగారు మిథున్ చక్రవర్తి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటుడిగా చేశారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో అలరించారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.
నేనెక్కడున్నా సినిమాతో మిమో చక్రవర్తి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి హీరోయిన్‌గా చేస్తోంది. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28) సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలపై లుక్కేద్దాం.
థాంక్యూ. ఫైనల్లీ ఫిబ్రవరి 28న 'నేనెక్కడున్నా' విడుదల కావడం సంతోషంగా ఉంది. నా చైల్డ్ హుడ్ అంతా సౌత్ మూవీస్ చూస్తూ గడిపా. ఊటీలో మా నాన్న గారికి (మిథున్ చక్రవర్తి)కి హోటల్ ఉంది. నేను అక్కడ ఉన్నాను. అందువల్ల, తెలుగు - తమిళ సినిమాలు చూస్తూ పెరిగా.
హ్యాపీగా ఫీలయ్యారు. నువ్ 100 పర్సెంట్ ఇవ్వు అని చెప్పారు. ఆర్టిస్టులకు, హీరో హీరోయిన్లకు భాష అనేది అడ్డు కాదు. కాకూడదు. ఇవాళ నేను తెలుగు సినిమా చేశా. రేపు ఆవకాశం వస్తే తమిళ, మలయాళ, పంజాబీ, భోజ్ పూరి సినిమాలు చేస్తాను. నాకు తెలుగు సినిమాలో అవకాశం రావడం పట్ల నాన్న సంతోషం వ్యక్తం చేశారు. భాష రాదని అసలు ఆలోచించవద్దని చెప్పారు.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కథ విన్నప్పుడు ఇందులో మహిళా సాధికారిత, మహిళా జర్నలిజం గురించి మాత్రమే చెప్పలేదు. ఇదొక సందేశాత్మక సినిమా కాదు. ఇందులో మెసేజ్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్.. ఇదొక కంప్లీట్ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు తమ కాళ్ల మీద ఎందుకు నిలబడలేరు? అనే చక్కటి సందేశాన్ని ఇస్తుంది.
పవన్ కల్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్ అంటే ఇష్టం. రజనీకాంత్ అన్నా ఇష్టమే. వారికి నేను ఫ్యాన్. మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాలని ఉంది.
తప్పకుండా చేస్తాను. విలన్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నాను. నటుడిగా నన్ను నేను పరిమితం చేసుకోవాలని అనుకోవడం లేదు. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ.
సంబంధిత కథనం
టాపిక్