Mentoo Teaser: ఇంత ప్రశాంతంగా ఉందేంటి రా.. అమ్మాయిలు లేరు కదా.. మెన్ టూ టీజర్ అదుర్స్-mentoo teaser out as it promises out and out comedy entertainer
Telugu News  /  Entertainment  /  Mentoo Teaser Out As It Promises Out And Out Comedy Entertainer
ఇంట్రెస్టింగా ఉన్న మెన్ టూ టీజర్
ఇంట్రెస్టింగా ఉన్న మెన్ టూ టీజర్

Mentoo Teaser: ఇంత ప్రశాంతంగా ఉందేంటి రా.. అమ్మాయిలు లేరు కదా.. మెన్ టూ టీజర్ అదుర్స్

13 February 2023, 22:17 ISTHari Prasad S
13 February 2023, 22:17 IST

Mentoo Teaser: ఇంత ప్రశాంతంగా ఉందేంటి రా.. అమ్మాయిలు లేరు కదా.. ఈ డైలాగ్స్ చాలు మెన్ టూ (#MENTOO) మూవీ ఎలా ఉండబోతోందో చెప్పడానికి. ఈ సినిమా నుంచి సోమవారం (ఫిబ్రవరి 13) టీజర్ రిలీజైంది.

Mentoo Teaser: ఓ మగాడిగా ఉండటం అంత సులువా? వాడికేంటి మగాడు.. ఎలాగైనా బతికేస్తాడు అని అంటుంటారు. కానీ నిజంగా మగాడిగా బతకడం అందరూ అనుకునేంత ఈజీనా? మెన్ టూ (#MENTOO) మూవీ టీజర్ చూస్తే కచ్చితంగా కాదనే అంటారు. ఆ మధ్యే ప్రపంచవ్యాప్తంగా మీ టూ (#metoo) ఉద్యమం ఎలా నడిచిందో తెలుసు కదా.

ఆ హ్యాష్‌ట్యాగ్ స్ఫురించేలా ఈ మెన్ టూ మూవీ టైటిల్ పెట్టడం విశేషం. నరేష్ అగస్త్య నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ జీ రెడ్డి డైరెక్ట్ చేశాడు. హక్కులు మహిళలకే కాదు.. పురుషులకూ ఉంటాయి. మగాడిగా బతకడం అంత సులువు కాదు అనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. గతంలో వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్సే సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక తాజాగా వచ్చిన టీజర్ వాటిని మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఈ మూవీ టీజర్ ను శర్వానంద్ లాంచ్ చేయడం విశేషం. మీ టూ ఉద్యమం పేరుతో పురుషులపై మహిళలు చేసిన చిన్న చిన్న ఫిర్యాదుల వల్ల వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది ఈ టీజర్ లో చూడొచ్చు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ఈ సినిమా టీజర్ రూపొందించారు.

ఇక టీజర్ ముగింపు అయితే హైలైట్ అనే చెప్పాలి. సినిమాలో మూడు ప్రధాన మేల్ క్యారెక్టర్లు ఓ కొండ చివరి నిల్చొంటారు. వాళ్లలో ఒకరు ఇంత ప్రశాంతంగా ఉందేంటి రా అంటే.. అమ్మాయిలు లేదు కదా అందుకే అని మరొకరు సమాధానమిస్తారు. ఇదొక్క డైలాగ్ తో మూవీలో తాను ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి.

లాటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కింద మౌర్య సిద్ధవరం ఈ సినిమాను తెరకెక్కించాడు. కమెడియన్ హర్ష, సీనియర్ నటుడు బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఎలీషా ప్రవీణ్ మ్యూజిక్ అందించాడు.

టాపిక్