#Mentoo OTT Release Date: పురుషుల కష్టాలను చూపించిన ‘మెన్‍టూ’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్-mentoo movie ott release date announced will stream from june 9 on aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mentoo Movie Ott Release Date Announced Will Stream From June 9 On Aha

#Mentoo OTT Release Date: పురుషుల కష్టాలను చూపించిన ‘మెన్‍టూ’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 02, 2023 08:07 PM IST

#Mentoo OTT Release Date: #మెన్‍టూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. పురుషుల కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రెండో వారాల్లోని ఓటీటీకి వచ్చేస్తోంది.

#Mentoo OTT Release Date: పురుషుల కష్టాలను చూపించిన ‘మెన్‍టూ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది
#Mentoo OTT Release Date: పురుషుల కష్టాలను చూపించిన ‘మెన్‍టూ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది

#Mentoo OTT Release Date: పురుషులు ఎదుర్కొనే కష్టాలను సరదాగా చూపించి కామెడీ ఎంటర్‌టైనర్‌గా '#మెన్‍టూ' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం థియేటర్లలో మే 26న విడుదలైంది. నరేశ్ అగస్త్య, బ్రహ్మజీ, హర్ష చెముడు (వైవా హర్ష), సుదర్శన్, రియా సుమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనాలతో నవ్వులు పూయించింది. మంచి టాక్‍ను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. వివరాలివే..

#మెన్‍టూ మూవీ ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. జూన్ 9వ తేదీన ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

“ప్రపంచ పురుషోత్తమురాలా.. మీ కోసం ఒక బిగ్ అనౌన్స్‌మెంట్. #మెన్‍టూ అంటూ ఈ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రంట్ వచ్చేస్తున్నారు. #మెన్‍టూ ఆహాలో జూన్ 9న ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్వీట్ చేసింది.

‘బియింగ్ ఏ మ్యాన్ నా ఈజీ!’ అనే క్యాప్షన్‍తో #మెన్‍టూ మూవీ వచ్చింది. తాము పని చేసే ఆఫీస్‍ల్లోని మహిళలతో ఎదుర్కొంటున్న కష్టాలను కొందరు పురుషులు పంచుకునే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. కామెడీ ప్రధానంగా వచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్లు కూడా ఉన్నాయి.

IPL_Entry_Point