Mem Famous Ticket Price: మేమ్ ఫేమస్ టికెట్ రూ.99కే..-mem famous ticket prices slashed for the selective theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mem Famous Ticket Prices Slashed For The Selective Theatres

Mem Famous Ticket Price: మేమ్ ఫేమస్ టికెట్ రూ.99కే..

Hari Prasad S HT Telugu
May 23, 2023 05:50 PM IST

Mem Famous Ticket Price: మేమ్ ఫేమస్ టికెట్ రూ.99కే ఇవ్వనున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ బంపర్ ఆఫర్ తో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

మేమ్ ఫేమస్ మూవీ
మేమ్ ఫేమస్ మూవీ

Mem Famous Ticket Price: మేమ్ ఫేమస్ మూవీ టీమ్ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ సినిమా వచ్చే శుక్రవారం (మే 26) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. రెగ్యులర్ ప్రమోషన్లతోపాటు టికెట్ల ధరలను తగ్గించే నిర్ణయం కూడా మేకర్స్ తీసుకోవడం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచుతారు.

ఇక చిన్న బడ్జెట్ సినిమాల టికెట్లను అందుబాటు ధరల్లో ఉంచుతారు. అయితే మేమ్ ఫేమస్ మూవీ కోసం మాత్రం కేవలం రూ.99కే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మేమ్ ఫేమస్ మూవీని కేవలం రూ.99కే చూడొచ్చు. దీనివల్ల తొలి రోజే థియేటర్లు పూర్తిస్థాయిలో నిండుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

కరోనా తర్వాత పెద్ద పెద్ద సినిమాలే బోల్తా పడుతున్న సమయంలో చిన్న సినిమాలు నడవాలంటే ఇలాంటి ప్రయత్నాలు ఏవో చేయాల్సిందే. సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ హీరోలు కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. ఫలితంగా మూవీపై బజ్ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్లో ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి ఫన్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సరదా సంభాషణలు, ఫేమస్ కావడానికి పడే పాట్లు ఆకట్టుకుంటాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం