నేచులర్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా యాక్టివ్‍గా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. తాజాగా హిట్ 3 తమిళ వెర్షన్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు నాని, శ్రీనిధి. ఈ సందర్భంగా తన నచ్చిన చిత్రం గురించి నాని వెల్లడించారు.
మీకు నచ్చిన తమిళ చిత్రం ఏదంటూ నాని, శ్రీనిధి శెట్టికి ప్రశ్న ఎదురైంది. లబ్బర్ పందు అని శ్రీనిధి చెప్పారు. తనకు మేయళగన్ (తెలుగులో సత్యం సుందరం) చిత్రం చాలా నచ్చిందని నాని తెలిపారు. ఈ దశాబ్దంలోనే అది ఒకానొక బెస్ట్ సినిమా అని అన్నారు.
మేయళగన్ చిత్రం మ్యాజికల్ అని నాని చెప్పారు. “తమిళం అనే కాదు.. ఈ దశాబ్దం అంతటిలో నాకు నచ్చిన చిత్రాల్లో మేయళగన్ ఒకటి. చాలా అందమైన చిత్రం. ఏడ్వడమే కాదు.. చాలా ఎమోషన్లలో మునిగిపోయా. అదో మ్యాజికల్ సినిమా. మీరు పెద్దపెద్ద సెట్లు వేయవచ్చు. రూ.1,000కోట్లు ఖర్చు చేయవచ్చు. వాటికి ప్రశంసలు వస్తాయి. కానీ ఇది (మేయళగన్) ఓ మ్యాజిక్. ఎంతో పర్సనల్‍గా అనిపించే విషయాలను టచ్ చేసింది. ఈ క్లాసికల్ సినిమా ఇచ్చినందుకు కార్తి, అరవింద స్వామి, డైరెక్టర్ ప్రేమ్.. మొత్తం టీమ్‍కు అభినందనలు” అని నాని అన్నారు.
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన తమిళ ఎమోషనల్ డ్రామా మూవీ మేయళగన్.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రానికి ‘96’ ఫేమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీగా ప్రశంసలు దక్కాయి.
మేయళగన్ చిత్రం గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగులో సత్యం సుందరం పేరుతో వచ్చింది. ఈ మూవీకి బాగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఎమోషనల్ చిత్రమైనా సుమారు రూ.50కోట్ల కలెక్షన్లు రాబట్టి హిట్ అయింది. ఈ మూవీ సుమారు రూ.35కోట్ల బడ్జెట్‍తో రూపొందింది.
కాగా, యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నాని నటించారు. వైలెంట్ యాక్షన్‍తో ఈ సినిమా ఉండనుంది. మే 1వ తేదీన తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం