Mehreen Sex Scene: అది సెక్స్ సీన్ కాదు.. దారుణమైన రేప్ సీన్: మెహరీన్ సీరియస్-mehreen says some depicting brutal rape scene as a sex scene in her new web series sultan of delhi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mehreen Says Some Depicting Brutal Rape Scene As A Sex Scene In Her New Web Series Sultan Of Delhi

Mehreen Sex Scene: అది సెక్స్ సీన్ కాదు.. దారుణమైన రేప్ సీన్: మెహరీన్ సీరియస్

Hari Prasad S HT Telugu
Oct 17, 2023 04:05 PM IST

Mehreen Sex Scene: అది సెక్స్ సీన్ కాదు.. దారుణమైన రేప్ సీన్ అంటూ మెహరీన్ సీరియస్ అయింది. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో హాట్ లిప్ లాక్స్, కొన్ని సీన్లపై ఆమె తీవ్రంగా స్పందించింది.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహరీన్ లిప్ లాక్ సీన్
సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహరీన్ లిప్ లాక్ సీన్

Mehreen Sex Scene: సెక్స్ సీన్‌కు, దారుణమైన రేప్ సీన్‌కు తేడా తెలియదా అంటూ మీడియాపై మండిపడుతోంది ఎఫ్2 బ్యూటీ మెహరీన్ కౌర్ పీర్జాదా. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో కొన్ని లిప్ లాక్స్, బెడ్ రూమ్ సీన్లు వైరల్ అవడం.. వాటిని సెక్స్ సీన్లుగా చెబుతుండటంపై ఆమె సీరియస్ అయింది. ఈ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

వెబ్ సిరీస్ ద్వారానే మెహరీన్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై అందాల ఆరబోత తప్ప పెద్దగా సెక్స్, కిస్ సీన్లలో నటించని మెహరీన్.. ఈ సిరీస్ లో మాత్రం కొన్ని అలాంటి సీన్లు చేసింది. దీంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెహరీన్ లిప్ లాక్, సెక్స్ సీన్లలో నటించిందంటూ మీడియా, సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టాయి.

దీనిపై మెహరీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు సెక్స్ సీన్లకు, రేప్ సీన్లకు తేడా తెలియదా అంటూ ప్రశ్నించింది. మంగళవారం (అక్టోబర్ 17) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘ పోస్ట్ రాసింది. కొన్ని సీన్లు నైతికతకు విరుద్ధంగా అనిపించినా.. ఓ నటిగా కథకు అనుగుణంగా అలాంటి వాటిలో నటించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పింది.

పెళ్లి తర్వాత బెడ్ రూమ్ లో భర్త చేసే దారుణమైన రేప్ సీన్ ను కొందరు సెక్స్ సీన్ అని రాస్తుండటంపై మెహరీన్ అసహనం వ్యక్తం చేసింది. అసలు మీకు అక్కచెల్లెళ్లు, కూతుళ్లు లేరా.. వాళ్లకు ఇలా జరిగితే అలాగే మాట్లాడతారా అంటూ ప్రశ్నించింది. ఆమె పోస్ట్ లో ఏముందంటే..

"ఈ మధ్యే నేను ఓ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ద్వారా ఓటీటీలోకి వచ్చాను. నా అభిమానులు ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొన్నిసార్లు కథను బట్టి మన నైతిక విలువలకు విరుద్థంగా కూడా నటించాల్సి వస్తుంది. ఓ ప్రొఫెషనల్ గా నటనను వృత్తిగా, ఉద్యోగంగా భావించే వాళ్లు ఎవరైనా అవసరాన్ని బట్టి ఇలాంటి సీన్లు చేయాల్సి వస్తుంది.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో ఓ సీన్ ఉంది. అది దారుణమైన పెళ్లి తర్వాత రేప్ ను సూచిస్తుంది. కానీ అలాంటిదానిని కూడా కొన్ని మీడియా వర్గాలు సెక్స్ సీన్లుగా వర్ణించడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి వాళ్ల అక్కచెల్లెళ్లు, కూతుళ్లకు వస్తే ఇలాగే చేస్తారా? వాళ్లకు అలాంటి పరిస్థితి రావద్దని నేను ప్రార్థిస్తున్నా" అని మెహరీన్ పోస్ట్ చేసింది.

IPL_Entry_Point