Mehreen Pirzada: సైకలాజికల్ థ్రిల్లర్‌గా మెహ్రీన్ మూవీ.. కొత్త హీరోతో అదిరిపోయిన రొమాన్స్
Mehreen Pirzada Spark Life: F2 అండ్ F3 సినిమాల హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్న మరో కొత్త చిత్రం స్పార్క్ లైఫ్. విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ ఇచ్చారు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయన్‌గా పరిచయమైన బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా తర్వాత పలు హిట్లను సొంతం చేసుకుంది. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అయితే తాజాగా కొత్త హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది ఈ బ్యూటి. విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ స్పార్క్ లైఫ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది మెహ్రీన్ పిర్జాదా. విక్రాంత్ స్వీయ కథ, రచన, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
స్పార్క్ లైఫ్‌లో మరో హీరోయిన్‌గా అశోకవనంలో అర్జున కల్యాణం ఫేమ్ రుక్సర్ దిల్లాన్ చేస్తోంది. హృదయం, ఖుషి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళీ నటుడు గురు సోమసుందరం ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు నవంబర్ 17న ఈ సైకాలిజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లోకి రాబోతోంది.
యమా ఆనందం అనే పాటతో స్పార్క్ లైఫ్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్రయూనిట్. ఆల్రెడీ ఈ పాట యూట్యూబ్‌లో 20 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘ఇది ఇది మాయ’ను రిలీజ్ చేసి మళ్లీ శ్రోతలను కట్టిపడేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. తాజాగా చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుపతిలోనే ఈ రెండో పాటను రిలీజ్ చేశారు.
అనంత శ్రీరామ్ సాహిత్యం, శ్రేయా ఘోషాల్, హేషమ్ అబ్దుల్ వాహబ్ ద్వయం గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక హేషమ్ అందించిన బాణీ అయితే ఎంతో మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది. సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోలోని విజువల్స్, ఫారిన్ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. విక్రాంత్, మెహరీన్‌ల మీద చిత్రీకరించిన ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండినట్టుగా కనిపిస్తోంది.
విక్రాంత్, మోహరీన్, రుక్సర్ దిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.