ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వారంలో మొత్తంగా కలిపి ఎన్ని సినిమాలు ఉన్న గురు, శుక్ర వారాల్లో మాత్రం అధికంగా ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అవుతుంటాయి. అలానే ఇవాళ (అక్టోబర్ 09) గురువారం సుమారుగా పది వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
వాటిలో స్పెషల్‌గా చెప్పుకునే సినిమాల్లో ఒక తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా చిత్రం కూడా ఉంది. ఆ సినిమానే మేఘాలు చెప్పిన ప్రేమకథ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు అయిన రాధిక, ఆమని అత్తాకోడలిగా నటించారు. హీరో నరేష్ అగస్త్యకు తల్లిగా ఆమని నటిస్తే నానమ్మగా రాధిక నటించింది.
అలాగే, కథానాయకుడికి తండ్రిగా సీనియర్ హీరో సుమన్ యాక్ట్ చేశారు. భార్యాభర్తలుగా ఆమని, సుమన్ నటించారు. మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమాకు స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వాన్ని విపిన్ అందించారు. ఉమాదేవి కోట ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో నరేష్ అగస్త్యకు జోడీగా హీరోయిన్ రబియా ఖటూన్ యాక్ట్ చేసింది.
మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమాలో మొత్తంగా నరేష్ అగస్త్య, రబియా ఖటూన్, సుమన్, ఆమని, రాధికతోపాటు విద్యులేఖ, తులసి, ప్రిన్స్ రామ వర్మ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
హీరోకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. నానమ్మ (రాధిక) దగ్గర సంగీతం నేర్చుకుంటాడు. కోటీశ్వరుడు అయిన హీరో బిజినెస్ చూసుకోవడం మానేసి మ్యూజిక్‌నే కెరీయర్‌గా మార్చుకుంటాడు. అది నచ్చని తండ్రి (సుమన్) హీరోను ఇంట్లోంచి బయటకు వెళ్లగొడతాడు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన హీరో ఓ పల్లెటూరిలో ఉంటాడు. అక్కడ హీరోకు హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంతలో హీరోయిన్‌ను మరొకరు ఇష్టపడుతూ వారి జీవితంలోకి వస్తారు. ఆ తర్వాత ఏమైంది? అసలు హీరో ఇంట్లోంచి బయటకు వచ్చి ఏం సాధించాలనుకున్నాడు? ఈ క్రమంలో రాధిక, ఆమని పాత్రలు ఏంటీ? హీరో హీరోయిన్ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మేఘాలు చెప్పిన ప్రేమకథ మూవీ చూడాల్సిందే.
రొమాంటిక్ లవ్ స్టోరీకి మ్యూజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కించిందే మేఘాలు చెప్పిన ప్రేమకథ. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత సన్ నెక్ట్స్‌లో మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీ రిలీజ్ అయింది. ఇవాళ మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది ఈ సినిమా.
ఈటీవీ విన్‌లో నేటి నుంచి మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమాను సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ రెండు ఓటీటీల్లో వీక్షించవచ్చు.
సంబంధిత కథనం