Waltair Veerayya OTT Release Date: ఓటీటీకి సిద్ధమైన వీరయ్య.. ఎప్పుడు? ఎందులో అంటే?
Waltair Veerayya OTT Release Date: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది.
Waltair Veerayya OTT Release Date: మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గతేడాది గాడ్ ఫాదర్ సక్సెస్ అందుకున్న మన చిరు.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరోసారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబందించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. థియేటర్లలో మాస్ యాక్షన్ దుమ్మురేపిన వీరయ్య ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం ఈ నెలాఖరు నుంచి ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్ ఫాం ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్యకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ భోళా శంకర్ అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
సంబంధిత కథనం