Chiru On TarakaRatna Health : తారకరత్నకు ఇక ప్రమాదం లేదు.. డాక్టర్లకు చిరు కృతజ్ఞతలు-megastar chiranjeevi tweet on tarakaratna health ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Megastar Chiranjeevi Tweet On Tarakaratna Health

Chiru On TarakaRatna Health : తారకరత్నకు ఇక ప్రమాదం లేదు.. డాక్టర్లకు చిరు కృతజ్ఞతలు

Anand Sai HT Telugu
Jan 31, 2023 03:34 PM IST

Chiranjeevi On TarakaRatna Health : సినీ నటుడు తారకరత్న గుండెపోటుకు గురై.. బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖులు ఆరా తీస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న గురించి ట్వీట్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (twitter)

తారకరత్న ఆరోగ్య(TarakaRatna Health) పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవీ(Chiranjeevi) స్పందించాడు. తారకరత్న ఆరోగ్యం, కోలుకోవడంపై ట్వీట్ చేశాడు. తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని తెలిపాడు. పూర్తిగా కోలుకోవాలని, ఇంటికి తిరిగి రావాలని చిరు ఆకాంక్షించారు. తారకరత్నకు చికిత్స అందించిన వైద్యులకు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. మెగాస్టార్ చిరు ట్వీట్ తో తారకరత్న ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు అనుకుంటున్నారు.

'సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.' అని చిరంజీవి అన్నాడు.

నందమూరి తారకరత్న(Tarakaratna) బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొంతున్నారు. తాజాగా వైద్యులు హెల్త్ బులెటిన్(Health Bulletin) విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా డాక్టర్లు ప్రకటించారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందించడం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ తోపాటుగా ఇతర అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స చేస్తున్నట్టుగా వెల్లడించారు.

తారకరత్న ఆరోగ్యం గురించి.. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టుగా నారాయణ హృదయాలయ(Narayana Hrudayalaya) తెలిపింది. నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరుకు ఇప్పటికే వెళ్లారు. చంద్రబాబు(Chandrababu), పురంధేశ్వరి, సుహాసిని తారకరత్న దగ్గరకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి మీద డాక్టర్లను ఆరా తీశారు. ఆదివారం ఉదయం.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు.

అయితే తారకరత్నకు గుండెపోటుతో పాటుగా మరో వ్యాధి కూడా ఉందని మెున్న ప్రకటించారు. మెలెనా(Melena) అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపారు. ఈ కారణంగానే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యపరిస్థితి క్లిష్టంగానే ఉందని తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెుదట కుప్పంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్న త్వరగా కోలుకోవాని.. అందరూ కోరుకుంటున్నారు.

IPL_Entry_Point