Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!-megastar chiranjeevi new title as boss of masses in vishwak sen laila pre release event poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 09, 2025 04:49 PM IST

Megastar Chiranjeevi: లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీని కోసం మూవీ టీమ్ ఓ పోస్టర్ రివీల్ చేసింది. ఇందులో చిరంజీవికి కొత్త టైటిల్ ఇచ్చింది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!

ఇటీవల కొందరు స్టార్ హీరోల బిరుదులు మారిపోతున్నాయి. నట సింహంగా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ ట్యాగ్ గాడ్ ఆఫ్ మాసెస్ అయింది. యంగ్ టైగర్‌గా చాలాకాలం పిలుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ బిరుదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్‍గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కాలం క్రితమే ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే, మెగాస్టార్ చిరంజీవికి కూడా తాజాగా కొత్త టైటిల్ కనిపించింది. లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ మూవీ టీమ్ వెల్లడించిన పోస్టర్లో నయా టైటిల్ ఉంది.

చిరూ కొత్త టైటిల్ ఇదే

లైలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవికి ‘బాస్ ఆఫ్ మాసెస్’ అంటూ కొత్త టైటిల్ ఉంది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ కోసం బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి రానున్నారని ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ ఈవెంట్ నేటి (ఫిబ్రవరి 9) సాయంత్రం జరగనుంది. మెగా మాస్ ఈవెంట్ పేరుతో ఇది జరగనుంది.

మెగా స్టార్ చిరంజీవిని చాలా మంది బాస్ అని పిలుస్తున్నారు. దీంతో ఆయనకు బాస్ ఆఫ్ మాసెస్ అని లైలా మూవీ టీమ్ పేరుపెట్టింది. ఇది మెగా అభిమానులకు కూడా నచ్చేసింది. అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టైటిల్ ఎంత పాపులర్ అవుతుందో చూడాలి.

అనిల్ రావిపూడి కూడా..

లైలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా గెస్టుగా రానున్నారు. చిరంజీవి, అనిల్ కాంబినేషన్‍లో ఈ చిత్రం రానుంది. దీంతో లైలా ఈవెంట్‍లో ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెబుతారా అనే ఆసక్తి కూడా నెలకొంది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు అనిల్.

రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీగా లైలా రూపొందింది. ఈ సినిమా వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సోనూ అనే పాత్రతో పాటు లైలా అనే లేడీ క్యారెక్టర్లోనూ విశ్వక్‍సేన్ కనిపించనున్నారు. అడల్ట్ డైలాగ్‍లు ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే ట్రైలర్ రాగా వైరల్ అయింది. యూత్‍కు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని విశ్వక్ ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.

లైలా చిత్రంలో విశ్వక్‍సేన్ సరసన ఆకాంక్షశర్మ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో బోల్డ్ సీన్లు, డైలాగ్‍లు ఎక్కువగా ఉన్నట్టు ట్రైలర్‌ ద్వారా అర్థమైంది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ప్రొడ్యూజ్ చేశారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా విడుదల కావాల్సి ఉంది. సంక్రాంతికే ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నా.. గేమ్ ఛేంజర్ ఉండటంతో వాయిదా వేసినట్టు తెలిసింది. కొత్త రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. అనిల్ రావిపూడితో తర్వాతి మూవీ చేసేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం