Godfather Hindi Trailer: గాడ్‍‌ఫాదర్ హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి?-megastar chiranjeevi new movie godfather hindi trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Megastar Chiranjeevi New Movie Godfather Hindi Trailer Released

Godfather Hindi Trailer: గాడ్‍‌ఫాదర్ హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి?

Maragani Govardhan HT Telugu
Oct 01, 2022 08:10 PM IST

Chiranjeevi Godfather: చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ హిందీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సల్మాన్ ఖాన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముంబయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సల్మాన్-చిరంజీవి
ముంబయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సల్మాన్-చిరంజీవి

Godfather Hindi Trailer Released: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో మెగాస్టార్ ఆహార్యం, డైలాగులు అదిరిపోయాయి. ఈ సినిమా టైటిల్‌కు తగినట్లుగానే ట్రైలర్ ప్రారంభంలో చిరు ఎంట్రీతోనే ఆకట్టుకునేలా ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది.

దీంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతంగా చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా శనివారం ముంబయిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మోహన్ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హిందీ వెర్షన్‌లోనూ మెగాస్టార్ ఆకట్టుకున్నారు.

ఇటీవలే గాడ్‌ఫాదర్ సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు.. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే కుటుంబంతో కలిసి అందరూ సరదాగా చూడవచ్చు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచాయి. ఇది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు.

<p>ముంబయిలో గాడ్‌ఫాదర్ టీమ్</p>
ముంబయిలో గాడ్‌ఫాదర్ టీమ్
WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.