Chiranjeevi: రజనీకాంత్ హీరో - చిరంజీవి ప్రజెంటర్ - తమిళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ ఏదంటే?
Chiranjeevi: రజనీకాంత్ హీరోగా 1989లో వచ్చిన తమిళ మూవీ మాప్పిళ్లై కి మెగాస్టార్ చిరంజీవి ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. అంతే కాకుండా ఈ మూవీలో చిరంజీవి గెస్ట్‌లో రోల్‌లో కనిపించాడు. అమలా అక్కినేని హీరోయిన్‌గా నటించిన ఈ తమిళ మూవీ థియేటర్లలో రెండు వందల రోజులకుపైగా ఆడింది.
Chiranjeevi: కెరీర్ ఆరంభంలో సౌత్ సూపర్ స్టార్స్ చిరంజీవి, రజనీకాంత్ కాళి, బందిపోటు సింహం సినిమాల్లో కలిసి నటించారు. తెలుగులో చిరంజీవి అగ్ర హీరోగా మారడం, తమిళంలో రజనీకాంత్ బిజీగా మారడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఆవిష్కృతం కాలేదు.
వీరిద్దరు కలిసి చివరగా స్క్రీన్‌పై కనిపించిన మూవీ మాప్పిళ్లై. రజనీకాంత్ హీరోగా తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మాప్పిళ్లై మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్‌లో తళుక్కున మెరిశారు. అంతే కాదు ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రజెంటర్‌గా వ్యవహరించడం గమనార్హం.
అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు...
తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఆధారంగా మాప్పిళ్లై మూవీ తెరకెక్కింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ తమిళ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు.
రజనీకాంత్, అల్లు అరవింద్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాకు సమర్పకుడిగా తన పేరు ఉంచేందుకు చిరంజీవి అంగీకరించారు. సుదీర్ఘ కెరీర్‌లో ప్రజెంటర్‌గా చిరంజీవి పేరుతో రిలీజైన ఏకైక మూవీ ఇదే కావడం గమనార్హం.
యాక్షన్ ఎపిసోడ్‌లో...
కేవలం ప్రజెంటర్‌గానే కాకుండా మాప్పిళ్లై మూవీలో ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో చిరంజీవి నటించాడు. రజనీకాంత్ పెళ్లిని అడ్డుకునేందుకు రౌడీలు రాగా....వారిని అడ్డుకునే యువకుడిగా గెస్ట్ పాత్రలో చిరంజీవి ఈ మూవీలో కనిపిస్తాడు. చిరంజీవి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ అప్పట్లో కోలీవుడ్ అభిమానులను మెప్పించింది.
అమల అక్కినేని హీరోయిన్...
1989లో రిలీజైన మాప్పిళ్లై మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో 200లకుపైగా రోజులు ఆడింది. ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా అమల అక్కినేని హీరోయిన్‌గా నటించింది. అత్త పాత్రలో శ్రీదివ్య నటించింది. విలన్‌గా చిన్న పాత్రలో శ్రీహరి ఈ మూవీలో కనిపిస్తాడు.
పున్నమినాగు...
మాప్పిళ్లై మూవీకి కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. తమిళంలో రజనీకాంత్‌తో 1980 దశకంలో పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు రాజశేఖర్. తెలుగులోనూ చిరంజీవితో పున్నమినాగు సినిమాను తెరకెక్కించాడు.
ధనుష్ రీమేక్...
మాప్పిళ్లై మూవీని అదే టైటిల్, కథతో ధనుష్ రీమేక్ చేశాడు. 2011లో రిలీజైన ఈ రీమేక్ మూవీలో హన్సిక హీరోయిన్‌గా నటించింది. అత్త పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి మనీషా కొయిరాలా కనిపించింది.
అత్తకు యముడు అమ్మాయి మొగుడు మూవీ తమిళంతో పాటు మరో ఏడు భాషల్లో రీమేక్ కావడం గమనార్హం.