Chairanjeevi Next Movie: కూతురు కోసం రంగంలోకి మెగాస్టార్.. సినిమా పచ్చజెండా..!-megastar chiranjeevi has signed a film for his daughter sushmitha konidela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Megastar Chiranjeevi Has Signed A Film For His Daughter Sushmitha Konidela

Chairanjeevi Next Movie: కూతురు కోసం రంగంలోకి మెగాస్టార్.. సినిమా పచ్చజెండా..!

Maragani Govardhan HT Telugu
Mar 10, 2023 05:18 PM IST

Chairanjeevi Next Movie: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమా తన కుమార్తే సుస్మిత కొణిదెల, అల్లుడు విష్ణ ప్రసాద్ నిర్మాణంలో చేయనున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారట.

కూతురుతో చిరంజీవి సినిమా
కూతురుతో చిరంజీవి సినిమా

Chairanjeevi Next Movie: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ అందుకుంది. దీంతో ఫుల్ జోష్ మీదున్నారు మన మెగాస్టార్. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చేసే ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం చిరు ఈ మూవీ తర్వాత తన కుమార్తే సుస్మిత కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపారట.

సుస్మిత కొణిదెల నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసేందుకు మార్గం సుగమమైంది. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. గతేడాది ఈ డైరెక్టర్ కార్తి హీరోగా సర్దార్ సినిమా రూపొందించి బంపర్ హిట్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్‌తో తీయబోయే సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ చిత్రానికి బీవీఎస్ రవి రచయితగా వ్యవహరిస్తున్నారని టాక్. ఆయన రాసిన కథ ఇప్పటికే మెగాస్టార్‌కు కూడా నచ్చిందని, దీంతో సినిమాకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది.

సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మెగాస్టార్ తన కూతురు నిర్మాణంలో సినిమా చేయడం ఇదే మొదటి సారి. సుస్మిత ఇప్పటికే ఈ ఏడాది శ్రీదేవి శోభన్ బాబు అనే చిత్రాన్ని నిర్మించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో మాత్రం మంచి వసూళ్లను రాబట్టాయి.

దీంతో తన రెండో చిత్రాన్ని తండ్రి మెగాస్టార్‌తో చేసేందుకు ఆత్రుతగా ఉన్నారు సుస్మిత. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చర్చలు ముగిశాయట. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే తెలియజేయనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలను తెలియజేయనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్