Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది: మాస్ బీట్‍తో మెగా ఫ్యాన్స్ ఊగిపోయేలా!
Bhola Shankar First song Promo: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి లిరికల్ సాంగ్ ఈనెల 4వ తేదీన విడుదల కానుంది.
Bhola Shankar First Song Promo: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి తమ అభిమాన మెగా హీరోను మాస్ అవతార్‌లో చూసేందుకు కుతూహలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భోళా శంకర్ సినిమాలోని మొదటి పాట ప్రోమోను చిత్ర బృందం నేడు (జూన్ 2) విడుదల చేసింది. భోళా మేనియా సాంగ్ ప్రోమో అంటూ దీన్ని రిలీజ్ చేసింది. ఈనెల 4వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. వివరాలు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
భోళా మేనియా సాంగ్ ప్రోమో.. మాస్ బీట్‍తో అదిరిపోయింది. చిరంజీవి లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. దీంతో మెగాస్టార్ అభిమానులను ఈ పాట ఊపేస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ మెగా గ్రేస్‍తో భోళా మేనియా మొదలైందంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. దర్శకుడు మెహర్ రమేశ్ స్టైలిష్ మాస్ ప్రజెంటేషన్ అంటూ పేర్కొంది. యూట్యూబ్‍లో ఈ ప్రోమో ఉంది.
లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహర్ రమేశ్ భోళా శంకర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. భోళా మేనియా అంటూ సాగే ఈ తొలిపాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక సినిమాను ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, క్రియేటివ్స్ కమర్షియల్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. రామ్‍బ్రహ్మం సుంకర ప్రొడ్యూజ్ చేస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ సహా మరికొందరు ప్రముఖ నటులు ఉన్నారు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్‍బస్టర్ అయ్యింది. రూ.100కోట్లకుపైగా కలెక్షన్‍తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ముఖ్యంగా మాస్ క్యారెక్టర్‌లో చిరు మరోసారి అభిమానులందరినీ అలరించారు. బాబీ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో రవితేజ కీలకపాత్ర పోషించారు.
సంబంధిత కథనం