Mega 157 : మెగా 157 పోస్టర్ రిలీజ్.. ఆ హిట్ దర్శకుడితో చిరంజీవి సినిమా
Chiranjeevi Birthday : మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. చిరంజీవి 157 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ తదపరి సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
మెగా157(Mega 157) చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(mega star Chiranjeevi Birthday) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. విడుదలైన పోస్టర్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజును అభిమానులు మంచి ట్రీట్ దొరికింది. చిరంజీవి కొత్త సినిమా(Chiranjeevi Cinema) గురించిన సమాచారం వెల్లడైంది.
చిరంజీవి ఇప్పుడు తన 157వ సినిమా (#Mega157) కి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రత్యేక డిజైన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. పెద్ద బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి యువ దర్శకుడు వశిష్ట(Director Vasishta) యాక్షన్ కట్ చెప్పనున్నాడు.
1990లో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మరో సినిమాలో నటించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఆయన 157వ సినిమా కూడా అలాంటి కథాంశంతో రూపొందడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తెలుగులో బింబిసార(Bimbisara) 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వశిష్టకు ఇప్పుడు బంపర్ ఛాన్స్ వచ్చింది. చిరంజీవి 157వ చిత్రానికి యాక్షన్ కట్ చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి #మెగా157 అని పేరు పెట్టారు. త్వరలోనే టైటిల్‌ను వెల్లడించనున్నారు. సాంకేతిక బృందంలో ఎవరు ఉన్నారు? మరి చిరంజీవితో ఏ ఆర్టిస్టులు నటిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ 'యూవీ క్రియేషన్స్' ద్వారా వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిరంజీవి కెరిర్లో సినిమాటోగ్రఫీలో అత్యంత ఖరీదైన సినిమా ఇదేనని అంటున్నారు. దర్శకుడు వశిష్ట ఈ సినిమాతో విభిన్న ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. నిప్పు, భూమి, గాలి, నీరు, ఆకాశం తదితర అంశాలను జోడించి త్రిశూలంతో నక్షత్రాకారంలో రూపొందించిన #మెగా157 సినిమా పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది.