Chiranjeevi New Movies: ఒకేసారి నాలుగు సినిమాలకు సై అన్న మెగాస్టార్.. వయసు తగ్గుతోందట.. చరణ్ ఏమన్నాడో చూడండి
Chiranjeevi New Movies: మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడట. ఈ విషయం అతని తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించడం విశేషం.
Chiranjeevi New Movies: మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచినట్లే కనిపిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో మాంచి ఊపు మీదున్న చిరు.. ఇప్పుడు ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడట. ఆదివారం (జూన్ 16) ఫాదర్స్ డే సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.
నాలుగు కొత్త సినిమాలకు చిరు సై
ఫాదర్స్ డే సందర్భంగా తొలిసారి తండ్రయిన రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన తండ్రి వయసు తగ్గుతోందని, ప్రస్తుతం అతడు నాలుగు కొత్త సినిమాలు చేస్తున్నట్లు చరణ్ చెప్పడం విశేషం.
"ఇప్పటికీ ఆయన ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే లేస్తాడు. జిమ్ చేస్తాడు. కేవలం నటుడు అయినంత మాత్రాన ఆయన ఇవన్నీ చేయడు. ఫిట్ గా ఉండాలన్న ఉద్దేశంతో తనకు తానుగా ఈ దినచర్యను పాటిస్తాడు. ఇప్పటికీ ఎంతో మంది డైరెక్టర్లను కలుస్తున్నాడు. ఆయన బిజీయెస్ట్ నటుడు. నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. నేను ఒకటో, రెండో చేస్తున్నానంతే. మా నాన్న వయసు ఎక్కువ కాదు.. తక్కువ అవుతుందనిపిస్తోంది" అని చరణ్ అనడం విశేషం.
చిరంజీవి నాలుగు సినిమాలు చేస్తున్నాడని చెప్పినా.. వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటు చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ తండ్రీ కొడుకులు కలిసి నటించిన ఆచార్య రిలీజైంది. తర్వాత రామ్ చరణ్ మరో సినిమాలో కనిపించలేదు. గేమ్ ఛేంజర్ కోసమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.
తాత కాదు చిరుత అనాలి
ఇక తన కూతురు క్లిన్ కారాతో చిరు చిన్న పిల్లాడిలా ఎలా ఆడతాడో కూడా ఈ సందర్భంగా చరణ్ చెప్పాడు. "ఆయన క్లిన్ తో ఉన్నప్పుడు ఆమెకు అన్నలా మారిపోతాడు. మా నాన్నలో ఆ కోణం చూడటం చాలా బాగా అనిపిస్తుంది. నన్ను తాత అనకు.. చిరుత అను అని క్లిన్ తో సరదాగా అంటాడు. మా అమ్మానాన్న క్లిన్ తో అలా ఆడుకోవడం చూసి నాకు చాలా బాగా అనిపిస్తుంది" అని చరణ్ చెప్పాడు.
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత గాడ్‌ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతోనూ మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక సర్దార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తోనూ చిరంజీవి మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్ మూవీ బోల్తా కొట్టడంతో రీమేక్స్ కు దూరంగా ఉండాలని చిరు నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకులతో పని చేయనున్నాడు. ఇక విశ్వంభర మాత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.