పవన్ కల్యాణ్ మొత్తానికి రెండేళ్ల తర్వాత హరి హర వీరమల్లుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జులై 24న మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం (జులై 3) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఈ ట్రైలర్ పై వాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు.
పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ ఉదయం రిలీజైన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం తర్వాత చిరంజీవి దీనిపై తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు. తన తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మంట పుట్టిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు.
“ఇదో ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్. సుమారు రెండేళ్ల తర్వాత కల్యాణ్ బాబు మూవీ స్క్రీన్స్ పై మంట పుట్టించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్” అని చిరు ట్వీట్ చేశాడు. ఇందులోనే ఈ ట్రైలర్ కు చెందిన యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు.
ఇక కాసేపటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ హరి హర వీరమల్లు ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని షేర్ చేశాడు. తెరపై పవన్ ను చూడటం ఓ ట్రీట్ అని అతడు అనడం విశేషం. “హరి హర వీరమల్లు ట్రైలర్ నిజంగా సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతోంది. బిగ్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్ గారిని చూడటం మనందరికీ ఓ ట్రీట్. మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్” అని చరణ్ ట్వీట్ చేశాడు.
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న హరి హర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. కొన్నాళ్లుగా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ తో అభిమానులకు మరింత విందు చేశారు. ధర్మం కోసం పోరాడే యోధుడిగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు. ట్రైలర్లో అతడు చాలా పవర్‌ఫుల్ లుక్, డైలాగులతో అదరగొట్టాడు.
సినిమా ఎంత గొప్పగా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొదట క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. రెండేళ్లుగా పవన్ మూవీ కోసం చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ జులై 24న ఓ పండగ రోజు కాబోతోంది. మరి ఈ మూవీ వాళ్ల అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
సంబంధిత కథనం