Varunlav Wedding: మెగా పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేములో మెగా హీరోలు - వరుణ్, లావణ్య పెళ్లి ఫొటో వైరల్
Varunlav Wedding: వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి చిరంజీవి ఓ ఫొటోను షేర్ చేశారు. మెగా హీరోలందరూ ఒకే ఫ్రేములో కనిపించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Varunlav Wedding: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం ఇటలీలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ డిస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కొద్ది మంది సన్నిహితులు, టాలీవుడ్ హీరోలు మాత్రమే హాజరయ్యారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. వరుణ్, లావణ్య పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
ఈ ఫొటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్,అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్‌తో పాటు మెగా హీరోలందరూ కనిపిస్తోన్నారు. ప్రేమ, బాధ్యతతో కూడిన కొత్త ప్రయాణాన్ని వరుణ్‌తేజ్,లావణ్య త్రిపాఠి మొదలుపెట్టారంటూ ఈ ఫొటోకు చిరంజీవి క్యాప్షన్ ఇచ్చాడు.కొత్త జంటను ఆశీర్వదించాడు.
చిరంజీవి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. మెగా పిక్ అఫ్ ది డే అంటూ చెబుతోన్నారు. మెగా హీరోలందరూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ఈ అరుదైన కలయికకు వరుణ్, లావణ్య పెళ్లి వేదికగా నిలిచిందని అభిమానులు చెబుతోన్నారు.ముఖ్యంగా ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.