Allu Arjun vs Mega Fans: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే మ‌రి రామ్‌చ‌ర‌ణ్? - బ‌న్నీ ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌-mega fans troll on allu arjun bunny calls ntr as telugu pride ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mega Fans Troll On Allu Arjun Bunny Calls Ntr As Telugu Pride

Allu Arjun vs Mega Fans: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే మ‌రి రామ్‌చ‌ర‌ణ్? - బ‌న్నీ ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2023 11:55 AM IST

Allu Arjun vs Mega Fans: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun vs Mega Fans: మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్న‌ట్లు టాలీవుడ్‌లో చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విభేదాల‌పై ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు హీరోలు కూడా సైలెంట్‌గానే ఉంటో వ‌స్తోన్నారు.

తాజాగా మ‌రోసారి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోన్నారు. . ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వ‌చ్చిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని చిత్ర బృందంతో పాటు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అభినందిస్తూ అల్లు అర్జున్‌ ఓ ట్వీట్ చేశాడు. ఆస్కార్ వేదిక‌పై తెలుగు పాట‌కు ద‌క్కిన గౌర‌వం చూస్తుంటే ఆనందంగా ఉందంటూ ఈ ట్వీట్‌లో బ‌న్నీ పేర్కొన్నాడు.

అంతేకాకుండా గ్లోబ‌ల్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ త‌మ స్టెప్పుల‌తో ప్ర‌పంచం మొత్తాన్ని షేక్ చేశారు అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్‌లో తెలుగు ప్రైడ్ అంటూ ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌ల్ని కురిపించాడు అల్లు అర్జున్‌. రామ్‌చ‌ర‌ణ్‌ను ను మాత్రం మై ల‌వ్‌లీ బ్ర‌ద‌ర్ అంటూ పేర్కొన‌డంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

ఎన్టీఆర్‌ను పొగుడుతూ రామ్‌చ‌ర‌ణ్‌ను త‌క్కువ చేయ‌డానికే బ‌న్నీ ఈ ట్వీట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే రామ్‌చ‌ర‌ణ్ ఏంటి అంటూ ట్వీట్లు చేస్తోన్నారు.

నంద‌మూరి హీరోలును అల్లు ఫ్యామిలీ ఫుల్ స‌పోర్ట్ ఇస్తూ లేపుతోంద‌ని, అల్లు అర్జున్ ఎన్టీఆర్‌కు స‌పోర్ట్ చేస్తుంటే అల్లు అర‌వింద్ బాల‌కృష్ణ‌ను లేపుతున్నాడో అంటూ మ‌రో ఫ్యాన్ కామెంట్ చేశాడు.

IPL_Entry_Point

టాపిక్