Meenakshi Chaudhary: వెంకటేష్‌లో ఎప్పుడు ఒక ఆనందం కనిపిస్తుంటుంది.. హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్
Meenakshi Chaudhary About Venkatesh Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి హీరో వెంకటేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే, సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని రోల్ గురించి పలు విశేషాలు చెప్పుకొచ్చింది.
Meenakshi Chaudhary About Venkatesh Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు.
యూట్యూబ్‌లో ట్రెండింగ్
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ ఇప్పటికే మంచి హిట్‌గా నిలిచాయి. యూట్యూబ్‌లో టాప్ 10 స్థానాల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.
జనవరి 14న రిలీజ్
ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో పార్ట్ కావడం ఎలా అనిపిస్తోంది?
-చాలా ఆనందంగా ఉంది. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను. ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేశాను. ఇందులో కామెడీ స్పేస్‌లో కాప్ (పోలీస్) రోల్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నన్ను కాప్ రోల్‌లో చూడటం ఆడియన్స్‌కి కూడా ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైం ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
సంక్రాంతి రావడం ఎలా అనిపిస్తోంది?
-లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్‌లా ఉంది. నన్ను బిలీవ్ చేసిన ఇంత మంచి అవకాశాల్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను నేను నిరూపించుకునే మంచి కథలు, పాత్రలు రావడం చాలా సంతోషంగా ఉంది.
ఇందులో కాప్ రోల్ కోసం ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నారా?
-కాప్ రోల్ చేయాలనేది నా డ్రీం. లక్కీగా నా కెరీర్ బిగినింగ్ లోనే రావడం సంతోషంగా ఉంది. రిఫరెన్స్ ఏమీ తీసుకోలేదు. మా డాడీ ఆర్మీ ఆఫీసర్. ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్‌పై ఐడియా ఉంది. నేను కూడా కొంత హోం వర్క్ చేశాను.
వెంకటేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఆయన వండర్‌ఫుల్ హ్యూమన్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్‌లో కూడా ఒక మంచి ర్యాపో ఉండేది. సీన్స్ అన్నీ ఫ్లోలో అద్భుతంగా జరిగాయి. వెంకటేష్ గారు చాలా ఫిట్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.
టాపిక్